తెలుగు చలన చిత్ర పరిశ్రమ వాణిజ్య మండలి అధ్యక్షుడు నారంగ్(78) కన్ను మూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే గత పది రోజుల నుంచి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. అయితే విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన ఈరోజు ఉదయం కన్నుమూశారు. నారాయణ్ దాస్ నారంగ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
నారాయణ్ దాస్ నారంగ్ ఏసియన్ మల్టీ ప్లెక్స్, ఏసియన్ థియేటర్స్‌కు అధినేత. అంతే కాకుండా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మూవీ ఫైనాన్షియర్‌గా సినీ పరిశ్రమకు నారంగ్ ఎన్నో సేవలు అందించారు. శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌లో ‘లవ్ స్టోరీ’, ‘లక్ష్య’ సినిమాలు నిర్మించిన ఆయన ప్రస్తుతం నాగార్జునతో ‘ఘోస్ట్’, ధనుష్‌తో మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మూవీ ఫైనాన్షియర్‌గా నారాయణ్ దాస్ నారంగ్ సినీ పరిశ్రమకు సేవలందించారు నారంగ్.