...

తమన్నా ఖాతాలో మరో ఐటెమ్ సాంగ్.. ఎవరితోనో తెలుసా.?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలిమ్స్ అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల మీద సిద్దు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్న మూవీ `గని´. కిక్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఉపేంద్ర,సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

వరుణ్ తేజ్ ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్ లో సరికొత్త లుక్ లో బాక్సర్ గా అలరించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా గురించి వచ్చిన అప్ డేట్స్ అన్నీ సినిమా మీద ఆసక్తిని రేకెత్తించగా, ఇప్పుడు ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఒక మాంచి మసాలా ఐటెం సాంగ్ ఉన్నట్టుగా యూనిట్ రివీల్ చేసింది. ఈ సాంగ్ లో ఓ స్టార్ హీరోయిన్ పర్ఫామెన్స్ చేసింది అని చెప్పుకొచ్చారు. అయితే ముందు ఈ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఓపెన్ చేయలేదు.

కానీ బుధవారం ఉదయం ఈ పాటలో మిల్కీ బ్యూటీ తమన్నా స్టెప్పులేసినట్లు చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది. దీంతో ఇది తమన్నా మరో మసాలా పాట గా డిసైడ్ అయ్యింది. తమన్నా గతంలో అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వర్, జైలవకుశ, కేజిఎఫ్ 1, సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఐటెం సాంగ్స్ తో దుమ్ము లేపగా ఇప్పుడు మరోసారి వరుణ్ తేజ్ తో కలిసి స్టెప్పులేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా.. జనవరి 15న ఈ ఐటెం సాంగ్ ని విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది.