...

Guppedantha Manasu: రిషితో ఓపెన్ అయినా వసు.. ఏకంగా ప్రేమిస్తున్నాను అంటూ!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. గౌతమ్ వసుధార ను కలవడానికి మంచి జోష్ లో వెళతాడు. ఆ విషయాన్ని రిషి తెలుసుకొని వసుధార కు కాల్ చేసి ప్రాజెక్ట్ ఫైల్ పట్టుకొని ఇంటికి రమ్మంటాడు. దానికి వసు సరే అని.. రిషి ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతుంది.

ఈ లోపు వసు ఇంటికి వెళ్లనే వెళ్లిన గౌతమ్.. అక్కడ వసుధార అని ఊరికే చెవి కోసిన మేక లాగా అరుస్తూ ఉంటాడు. పాపం అక్కడ వసుధార లేదని గౌతమ్ కు తెలియదు. ఈలోగా గౌతమ్ దగ్గరికి వచ్చిన జగతి వసుధార బయటికి వెళ్ళింది అని చెబుతుంది. దాంతో గౌతమ్ నిరాశ పడతాడు. ఇక మహేంద్ర రిషిను ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు.

చిన్న వర్క్ మీద బయటకు వెళుతున్నాను ఒకరి కోసం వెయిటింగ్ అని చెబుతాడు. వెంటనే దేవయాని ఇంతకు.. ఎవరు వచ్చేది? అని అడగగా వసుధార వస్తుందని చెబుతాడు. ఆ మాటతో రిషి పెద్దమ్మ తో సహా ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతారు. తర్వాత దేవయాని, రిషితో.. తనని ఎందుకు పిలవడం చేసిన నిర్వాహలు చాలవా అని అంటుంది.