Child beat : అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లిన ఓ మూడేళ్ల బాలుడు అమ్మ కావాలంటూ గుక్కపట్టి ఏడ్వడం మొదలు పెట్టాడు. అయితే ఆ బాలుడి ఏడుపు ఆపేందుకు బొమ్మలో, చాక్లెట్లో ఇవ్వాల్సిన ఆయమ్మ… ఆ బాలుడి మూతికి వాత పెట్టింది. ఈ అమానవీయ ఘటన అనంతరురం పట్టణంలోని కోవూరునగర్ కాలనీ అంగన్ వాడీ కేంద్రంలో చోటు చేసుకుంది.
లక్ష్మీ, సంగారెడ్డిల మూడేళ్ల బాలుడు ఈశ్వర్ కృష్ణను రోజూలాగే అంగన్ వాడీకి పంపించారు. కానీ ఆ బాలుడు అమ్మ కావాలంటూ పదే పదే ఏడ్చాడు. అయితే చిన్న పిల్లాడి ఏడుపును ఆపాల్సిన ఆయమ్మ… వంటగదిలోకి తీసుకెళ్లి కడ్డీతో మూతి మీద వాత పెట్టింది. బాధ, మంటలో ఆ బాలుడు మరింత ఏడ్వడం ప్రారంభించాడు. అక్కడ ఉండటం ఇష్టం లేక ఇంటికి పరిగెత్తడం ప్రారంభించాడు. అప్పటికీ మనసు కరగని ఆ ఆయమ్మ.. ఓ చెట్టు కొమ్మ తీసుకొని కొట్టడం ప్రారంభించింది. అయితే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లి ఆయాను ప్రశ్నించారు. ఎదురు తిరిగి మాట్లాడటంతో ఐసీడీఎస్కు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తప్పని తేలితే.. కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సీడీపీఓ లలిత వెల్లడించారు.
Read Also :Child Care: చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే… ఈ ఆహార పదార్థాలు తినిపించాల్సిందే!