...

TSPSC Group-1: గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!

TSPSC Group-1: తెలంగాణలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి నోటిఫికేషన్ కావడంతో లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్ 1 ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రిపరేషన్ లో అభ్యుర్థులు ముందుగా సిలబస్ లో పేర్కొన్న సబ్జెక్టులు, టాపిక్ ల వారీగా ప్రశ్నల సంఖ్య వెయిటేజీపై అవగాహన పెంచుకోవాలి. అయితే మొత్తం 150 మార్కులతో ఈ పరీక్ష నిర్వహిస్తారు.

ఇందులో 13 అంశాలను సిలబస్ లో పేర్కొన్నారు. ఈ టాపిక్స్ అన్నీ కూడా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్నవే. కాబట్టి ఒక్కో అంశం నుంచి 10 నుంచి 15 వరకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అయితే టీఎస్ పీఎస్సీ వారికి తెలంగాణ చరిత్ర నుంచి 15 నుంచి 20 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పాలిటీ విభాగంలోనూ కోర్, సమకాలీన అంశాల కలయికతో 15 ప్రశ్నలు అడిగుతారు. ఎకానమీ నుంచి 10 నుంచి 12, జాగ్రఫీ నుంచి 10 నుంచి12 అంచనా వేయొచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్ లోనుంచి 12 లేదా 15 ప్రశ్నలు వ్చచే అవకాశం ఉంది. కాబట్టి బాగా చదవండి.