...

Alia-Ranabir Wedding : ఈరోజే ఆలియా-రణబీర్‌ల వివాహం.. కంగ్రాట్స్ చెప్పిన బిగ్‌బీ!

Alia-Ranabir Wedding : బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ ఆలియా భట్, రణబీర్ కపూర్ ల పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది. గురువారం రోజు ఇంటే ఈరోజే వారిద్దరి వివాహం జరగబోతున్నట్లు రణబీర్ సోదరి రిద్ధిమా కపూర్​ సావ్నే వెల్లడించారు. మొన్నటి వరకు ఏప్రిల్ 14వ తేదీనే పెళ్లి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ సెక్యూరిటీ దృష్ట్యా పెళ్లి తేదీలో కొన్ని మార్పులు జరిగినట్లు.. దీంతో వివాహాన్ని వాయిదా వేసినట్లు ఆలియా కజిన్ తెలిపాడు. కానీ ఇదంతా అబద్ధమే. అయితే ఈరోజే పెళ్లి జరగబోతోంది. రణబీర్ బాంద్రా నివాసంలో పెల్లి జరుగుతుంది.

Advertisement
Alia-Ranabir Wedding
Alia-Ranabir Wedding

అయితే ఈరోజు పెళ్లి చేసుకోబోతున్న రణ్​బీర్​ కపూర్​- ఆలియా భట్ జంటకు బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని లవ్ సాంగ్ ‘కేసరియా’ పాటను​ను సోషల్​ మీడియా వేదికగా షేర్ చేశారు. ‘భవిష్యత్​లో చాలా ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న మా ఇషా, శివకు శుభాకాంక్షలు. బ్రహ్మాస్త్ర టీమ్​ నుంచి ప్రత్యేక వేడుకలు ప్రారంభిద్దాం’ అంటూ ఆ వీడియోకు జోడించారు. ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో రణ్​బీర్ పాత్ర పేరు శివ కాగా.. ఆలియా పాత్ర పేరు ఇషా.

Advertisement

Read Also : KGF 2 Movie Review : ‘కేజీఎఫ్‌’ 2 రివ్యూ : యాక్షన్ డోస్ ఎక్కువైంది…!

Advertisement
Advertisement