Brahmastra trailer: బ్రహ్మాస్త్ర ట్రైలర్ వచ్చేసిందోచ్.. విజువల్స్ మామూలుగా లేవుగా!

Updated on: June 15, 2022

Brahmastra trailer : రణబీర్ కపూర్, ఆలియా భట్ కాంబోలో రాబోతున్న బ్రహ్మాస్త్రం సినిమా ట్రైలర్ ను కాసేపటికి క్రితమే రిలీజ్ చేశారు. ఇక ఇందులో శివ పాత్రలో రణబీర్ కపూర్, ఇషాగా ఆలియా భట్ కనిపించారు. అయితే ఇందులో పంచ భూతాలనైన అగ్నితో శివకు ఉన్న సంబంధాన్ని చూపించారు. శివ పాత్ర చుట్టే ఈ సినిమా తిరిగేట్లు కనిపిస్తోంది. అగ్నితో తనకు ఉన్న అనుబంధఁ, బ్రహ్మాస్త్రంలో శివకు ఉన్న రిలేషన్ ఏంటో చూచాయగా చూపించారు. అయితే తెలుగు ట్రైలర్ కు మెగాస్టార్ చిరంజీవి, హిందిలీ బిగ్ బీ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అయితే ఇందుకు తగ్గట్టుగా విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ కూడా అదరహో అనిపించాయి. టోటల్ గా ఈ బ్రహ్మాస్త్రం బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు.

Brahmastra trailer
Brahmastra trailer

మొత్తంగా ఆకట్టుకున్న ఈ ప్రచార చిత్రం… సినిమాపై భారీగా అంచనాలను పెంచింది. దీన్నిదర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. సుమారు రూ.400 కోట్లకు పైగా రూపుదిద్దుకున్న ఈ ప్రతిష్టాత్మకమైన సినిమ… వివిధ అస్త్రాల విశిష్టతను తెలియజేసే కథాంశంతో తెరకెక్కింది. సెప్టెంబర్ 9 ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel