New Movie Updates : ఈవారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలేంటో తెలుసా?

New Movie Updates : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన పాల్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ రెండో వారమూ బాక్సాఫీసు కళకళలాడుతోంది. అయితే ఈ క్రమంలో ఈ వారం అటు థియేటర్ లలోనే ఓటీటీలోనూ ఏ ఏ సినిమాలు విడుదల కాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

యువ కథానాయకుడు వరుణ్ తేజ్ నటించిన గని సినిమా, వర్మ డైరెక్ట్ చేసిన మమా ఇష్టం(డేంజరస్), అలాగే స్టాండప్ రాహుల్ సినిమాలు ఏప్రిల్ 8వ తేదీన థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మర్డర్ ఇన్ అగోండా అనే హిందీ సినిమా ఏప్రిల్ 8వ తేదీన స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే అదే రోజున మలయాళం సినిమా నారదన్ కూడా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. అలాగే నెట్ ఫ్లిక్స్‌లో చస్వీ అనే హిందీ సినిమా ఏప్రిల్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

అదే రోజు నుండి ఎత్తర్కం తునిందావన్ అనే తమిళ సినిమా కూడా రాబోతుంది. అలాగే ఎలైట్ అనే వెబ్ సిరీస్, మెటల్ లార్డ్స్ అనే హాలీవుడ్ సినిమా, ద ఇన్ బిట్విన్ అనే మరో సినిమా ఏప్రిల్ 8వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ద కింగ్స్ మెన్ అనే హాలీవుడ్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఏప్రిల్ 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఆలాగే జీ5లో ఎక్ లవ్ యా అనే కన్నడ సినిమా, అభయ్ అనే హిందీ చిత్రం కూడా ఏప్రిల్ 8 తారీఖు నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

Advertisement

Read Also : Shankar Ram Charan : పొలిటిషియన్ లుక్‌లో సైకిల్‌పై రామ్ చరణ్.. ఫొటో లీక్..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel