Allu sneha reddy : అల్లు అర్జున్ గురించి తెలియని సినీ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ప్యాన్ ఇండియా వైడ్ గా స్టార్ గా మారాడు బన్నీ. గత సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అల్లు కుర్రాడు. పుష్ప సినిమాతో ఏకంగా ప్యాన్ ఇండియా లెవల్ లో స్టార్ గా ఎదిగాడు. మెగాస్టార్ చిరంజీవి అడుగు జాడల్లో పయనిస్తూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చాడు. అల్లు అర్జున్. వరుస సినిమాలతో ఊపు మీదున్న బన్నీ… ఎప్పుడూ తన ఫ్యామిలీని కేర్ చేయని సందర్భం ఒక్కటి కూడా లేదు. తన బిజీ షెడ్యూల్ లో కూడా కుటుంబానికి తగిన సమయం ఇస్తుంటాడు బన్నీ. తన కొడుకు, కూతళ్లతో కలిసి చేసిన అల్లరిని వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.
అల్లు అర్జున్ లాగా ఆయన భార్య స్నేహా రెడ్డి కూడా అప్పుడప్పుడు తన పిల్లల ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా స్నేహా రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ లో తన కొడుకు, కూతుళ్ల ఫోటోలు పోస్టు చేసింది. మై బేబీస్ అంటూ అర్హ, అయాన్ క్యూట్ పిక్స్ ను షేర్ చేసింది స్నేహా రెడ్డి. ఈ ఫోటోల్లో ఇద్దరు అల్లు వారసులు ఎంతో క్యూట్ గా కనిపిస్తున్నారు. సరదా సరదాగా ఉన్నారు. అర్హ త్వరలో శాకుంతలం చిత్రంతో ఇండస్ట్రీని పలకరించనున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్ ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా? అసలు నిజాన్ని బయటపెట్టేసిన మామ…!