...

Allu Arjun: బన్నీ ఏంటీ ఇలా మారిపోయారు… వడా పావ్ లా తయారైన బన్నీ..ఫోటో వైరల్!

Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో ఈయన దేశవ్యాప్తంగా మరింత క్రేజ్ సంపాదించుకున్నారు.గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విపరీతమైన ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా మంచి విషయం కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా పుష్ప 2 రాబోతోంది.

allu-arjun-changed-a-lot-and-he-look-like-a-vada-pav-photo-goes-viral
allu-arjun-changed-a-lot-and-he-look-like-a-vada-pav-photo-goes-viral

పుష్ప సీక్వెల్ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతోంది. అయితే ఈ సినిమా కోసం బన్నీ అదే లుక్ మెయిన్ టైన్ చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా బన్నీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బన్నీ గడ్డం, రింగుల జుట్టుతో కనిపించారు. అలాగే ప్రింటెడ్ టీ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ధరించిన ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన అభిమానులు బన్నీ లుక్ పై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఫోటోలో అల్లు అర్జున్ కాస్త బొద్దుగా తయారయ్యారు. ఈ విధంగా అల్లు అర్జున్ లావు ఉండడంతో నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. మరి బొద్దుగా తయారవుతున్నావ్ అన్న అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం సూపర్ లుక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొందరైతే క్రికెటర్ మలింగను గుర్తు చేస్తున్నావు అని కామెంట్ చేయగా మరొక నెటిజన్ అయితే ఏకంగా వడపావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి బన్నీ ఈ లుక్ కి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.