Actress Sruthi Haasan : లోక నాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తక్కువ సమయంలోనే బడా హీరోలతో నటించే ఛాన్స్ అందుకుంది శృతి హాసన్. ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన శృతి… గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. కెరీర్ మంచి పిక్స్‌లో ఉన్న సమయంలోనే ఇంగ్లాండ్ సింగర్ మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడి సినిమాలను వదిలేసింది. ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది శృతి.
ఇటీవల రవితేజ సరసన “క్రాక్” సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ సరసన “వకీల్ సాబ్” సినిమాలో నటించింది. కాగా ప్రస్తుతం ప్రభాస్ సరసన “సలార్”, బాలయ్య 107 సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. ఇందులో కూడా ఈమె హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది.
https://twitter.com/prashanth_neel/status/1486919462729125889?s=20&t=ckXyaCvJlbWfWFkOnCxdRQ
నేడు (జనవరి 28) శ్రుతీహాసన్ బర్త్‌డే సందర్బంగా సలార్ టీమ్ ఆమెకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ మేరకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ… సలార్ మూవీలో ఆమె ఫస్ట్ లుక్‌ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ సినిమాలో ఆద్య పాత్రలో శృతి హాసన్ నటించనుంది. దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో శృతి కనిపిస్తోంది.
బొగ్గు గనుల మాఫియా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. అలానే శృతి అభిమానులంతా ఆమెకి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.
Read Also : RRR Movie Release Date : RRR మూవీ విడుదల మార్చిలో కష్టమే.. ఎందుకో తెలుసా?!
Tufan9 Telugu News And Updates Breaking News All over World