Actress Hema Reaction : నా పేరు బద్నాం చేస్తున్నారంటూ హేమ షాకింగ్ కామెంట్స్..!

Actress Hema Reaction
Actress Hema Reaction

Actress Hema Reaction : హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో గత రాత్రి రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో జరిగిన పోలీసుల దాడి హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆదివారం రాత్రి 2.30 నిమిషాలకు ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో డ్రగ్స్‌ బయట పడ్డాయి. అయితే ఈ కేసుకు సంబంధించి పలువురు ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్లలో నిహారికతో పాటు ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే నటి హేమ కూడా ఆ పబ్ లో ఉందంటూ వచ్చిన వార్తలను ఆమె కొట్టి పడేశారు.

ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ తన పేరుని పలు ఛానళ్లల్లో ప్రసారం చేస్తున్నారని నటి హేమ ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి అసత్య ప్రచారం చేస్తూ… తనని బద్నాం చేస్తున్నారంటూ వాపోయారు. అయితే తనపై అవాస్తవాలు ప్రసారం చేస్తోన్న సదరు మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆమె బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు.

Advertisement

Read Also : Banjara Hills Pub Case : పబ్ కేసుపై నాగబాబు స్పందన.. ఏమన్నారో తెలుసా?

Advertisement