NTR 30: ఎన్టీఆర్ బర్తడే స్పెషల్.. ఎన్టీఆర్ 30 లో ఈ విషయాన్ని గమనించారా?

NTR 30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు పుట్టిన రోజు జరుపుకోవడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా అభిమానులు పలు ప్రాంతాలలో సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులు ఇతర నటీనటులు దర్శకులు ఎన్టీఆర్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక తారక్ పుట్టిన రోజు కావడంతో ఆయన 30, 31 వ సినిమాలకు సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు.

NTR 30
NTR 30

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తన 30 ఓ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయడం, 31వ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ క్రమంలోనే కొరటాల శివ మోషన్ టీజర్ విడుదల చేసి ప్రేక్షకులను సందడి చేయగా ప్రశాంత్ నీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి అభిమానులను సందడి చేశారు. ఇకపోతే కొరటాల శివ విడుదల చేసిన మోషన్ టీజర్ వీడియో ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు తెప్పించే లా ఉంది. వీడియోలో తారక్ బేస్ వాయిస్‌తో చెప్పిన డైలాగ్‌తో ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చారు.

అయితే ఈ వీడియోలో మీరు ఒక చిన్న విషయాన్ని గమనించారా. ఈ వీడియోలో చిత్ర బృందానికి సంబంధించిన అందరి పేర్లు మనకు కనిపిస్తాయి. డైరెక్టర్ కొరటాల శివ పేరు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, సినిమాటోగ్రఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌ల పేర్లను ఈ వీడియోలో మనం చూడొచ్చు. అయితే ఈ వీడియోలో మనం ఒకరి పేరును మర్చిపోయాము. గత కొద్ది రోజుల నుంచి ఎన్టీఆర్ 30 వ చిత్రంలో నటించే హీరోయిన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి.అయితే తాజాగా విడుదల చేసిన వీడియోని బట్టి చూస్తే ఇప్పటి వరకు ఈ సినిమా హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. అందుకే ఇక్కడ హీరోయిన్ పేరు లేదు. ఇక ఎన్టీఆర్ 30 వ సినిమాలో అలియా నటిస్తుందని రష్మిక, కియారా అద్వానీ,జాన్వీ కపూర్ వంటి వారి పేర్లు పెద్దఎత్తున వినిపించినప్పటికీ ఇంకా ఈ విషయంలో దర్శకనిర్మాతలు ఎలాంటి క్లారిటీ తీసుకోలేదని ఈ వీడియో ద్వారా అర్థమైంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel