Face black spots: ముఖంపై నల్ల మచ్చలు ఉన్నాయా.. వీటి వల్ల కేవలం అందంగా కనిపించక పోవడమే కాదు ఆత్మ విశ్వాసం కూడా కోల్పోతారు. నలుగురిలో ఉన్నప్పుడు ముఖంపై మచ్చలు ఉంటే ఎలా కనిపిస్తామో.. ఎవరు ఏమనుకుంటారో అని తెగ మదనపడి పోతుంటారు చాలా మంది. నల్ల మచ్చలు, మంగు మచ్చలు వంటివి ఉంటే ముఖం అందంగా కనిపించదు. ఫేస్ చూసినప్పుడు అవే ఎక్కువగా కనిపిస్తాయి.
అయితే ఈ సమస్యకు ఇంట్లో నుండే పరిష్కారం ఉంది. వంటింట్లో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి ఈ సమస్య నుండి బయట పడవచ్చు. ఒక చిన్న గిన్నెలో 2 స్పూన్ల పెరుగు తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ చక్కెర, అరచెక్క నిమ్మ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో రసం పిండేసిన నిమ్మ చెక్కను ముంచి ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.
ఈ విధంగా 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజూ చేస్తూ ఉంటే ముఖంపై మంగు మచ్చలు, నల్ల మచ్చలు క్రమంగా తొలిగిపోతాయి. పెరుగు సహజ సిద్ధమైన ఎక్స్ ఫ్లోయెట్ గా పని చేస్తుంది. చర్మంపై ఉన్న మచ్చలను తగ్గించడానికి సాయ పడుతుంది. నిమ్మ రసంలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలు ముఖం మీద మచ్చలను తగ్గిస్తుంది. చక్కెర చర్మం మీద మచ్చలను తొలగించడానికి సాయ పడుతుంది.