Socked Almond Benefits : జనరల్‌గా బాదం పప్పును పిల్లలు, పెద్దలూ ఇష్టపడుతుండటం మనం చూడొచ్చు. ఇకపోతే బాదంను కంపల్సరీగా తమ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులూ సూచిస్తుంటారు. అలా బాదం పప్పుకు స్పెషల్ సూపర్ ఫుడ్ ఐటంగా పేరుంది. ఇందులో ఉండే ఫైబర్, మెగ్నిషియం, ఓమేగా ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ , విటమిన్స్, న్యూట్రీషియన్స్ హ్యూమన్ హెల్త్‌కు చాలా కావల్సినవి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే చాలా చక్కటి ప్రయోజనాలుంటాయి. అయితే, కొందరు నానబెట్టిన బాదం తినొచ్చా.. తినకూడదా.. అని సందేహపడుతుంటారు. కానీ, నానబెట్టిన బాదం తినడం వలన చాలా చక్కటి ఉపయోగాలుంటాయి. అవేంటో తెలుసుకుందాం.
బాదంను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా హార్ట్‌కు చాలా మంచిది. హార్ట్‌ను హెల్దీగా ఉంచడంలో బాదం కీ రోల్ ప్లే చేస్తుంది. ప్రతీ రోజు బాదం తినడం వలన ఇన్సూలిన్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.అయితే, బాదంను డైరెక్ట్‌గా తినడం కంటే కూడా నానబెట్టి తింటేనే చాలా చక్కటి ఉపయోగాలుంటాయని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.
నానబెట్టినపుడు బాదంలో ఉండే టానిన్ అనే పదార్థం ఊడిపోతుంది. తద్వారా మీ ఆరోగ్యానికి ఇంకా మేలు జరుగుతుంది. ఒకవేళ నానబెట్టకుండా డైరెక్ట్‌గా బాదంను తీసుకున్నట్లయితే టానిన్ పదార్థం డైరెక్ట్‌గా శరీరంలోకి వెళ్తుంది. కాబట్టి.. బాదంను డైరెక్ట్‌గా కాకుండా నైట్ టైమ్స్‌లో నానబెట్టి మార్నింగ్స్‌లో తీసుకుంటేనే చాలా చక్కటి ఉపయోగాలుంటాయి.
బాదం నానబెట్టిన తర్వాత తీసుకుంటే కనుక మెమొరీ పవర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. వెయిట్ లాస్ అవాలనుకునే వారికి బాదం బాగా ఉపయోగపడుతుంది. బాదంలో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ద్వారా స్టమక్ టైట్ అయిపోతుంటుంది. ఫలితంగా ఎక్కువగా ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉండబోదు. అలా మీరు వెయిట్ లాస్ అయ్యే చాన్సెస్ మెండుగా ఉంటాయి. ఆకలి కూడా తగ్గిపోతుంటుంది. అలా మీరు ఈజీగా వెయిట్ లాస్ కావచ్చు.
Read Also : Luffa Health Benefits : మద్యం ఎంత తాగినా బీరకాయలు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు.. ఈ సంగతి మీకు తెలుసా?