...

Luffa Health Benefits : మద్యం ఎంత తాగినా బీరకాయలు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు.. ఈ సంగతి మీకు తెలుసా?

Luffa Health Benefits : మద్యం తాగడం వలన మనిషి ఆరోగ్యానికి కలిగే నష్టాల గురించి అందరికీ తెలుసు. అయితే, కొంత మంది ఆల్కహాల్ వలన కలిగే నష్టాలు తెలిసినప్పటికీ సేవిస్తూనే ఉంటారు. మద్యం తాగొద్దని వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరించినప్పటికీ అదే పనిగా మద్యం తాగు..తూనే ఉంటారు. అలా చేయడం వలన మనిషి శరీరంలోని అవయవాలన్నీ కూడా పాడైపోతాయి. లివర్ పాడైపోతుంది. కాగా, మద్యం ఎంత తాగినా బీరకాయలు తింటే మాత్రం చాలా చక్కటి ప్రయోజనాలున్నాయి. ఈ విషయం అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.

బీరకాయ తీసుకోవడం ద్వారా లివర్‌కు బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయని, తద్వారా మద్యం వలన కలిగిన నష్టమంతా పూడ్చబడుతుందని తేలిందని పరిశోధకులు అధ్యయనంలో పేర్కొన్నారు. ఇకపోతే ఆరోగ్య ప్రదాయిని అయిన బీరకాయ గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. దాదాపుగా అందరూ తమ ఆహారంలో బీరకాయను భాగం చేసుకునే ఉంటారు.

బీరకాయలో ఉండే పోషకాలు కాలేయం దెబ్బ తినకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. సగం పాడైపోయిన కాలేయాన్ని కూడా బీరకాయలు బాగు చేస్తాయి. ఇకపోతే బీరకాయలో ఉండేటువంటి ఎంజైమ్‌ల ద్వారా మానవుడు పలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. ఈ విషయాలను వైద్యులు కూడా చాలా సార్లు తెలిపారు.

బీరకాయలను రెగ్యులర్‌గా తీసుకుంటే కనుక కళ్ల సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. కంటి సమస్యలు, ఇబ్బందులు నయం చేసుకునేందుకుగాను ఈ క్రమంలో బీరకాయలు తింటే చాలా మంచిది. బీరకాయల్లో ఉండేటువంటి బీ6, ఎనీమియ ఇంకా ఇతర ప్రోటీన్స్, విటమిన్స్, పీచు పదార్థాలు హ్యూమన్ ఇమ్యూనిటీ పవర్‌ను ఇంక్రీజ్ చేస్తాయి. బీరకాయలను ప్రతీ రోజు తీసుకోవడం వలన మద్యం తాగినపప్పటికీ ఇంకా ఎక్కువ కాలం బతికే చాన్సెస్ ఉంటాయి. ఈ క్రమంలోనే బీరకయాలను ప్రతీ రోజు తమ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : Knee Pain Relief : ఈ చిట్కాలతో కీళ్ల నొప్పులకు చెక్..