...

Knee Pain Relief : ఈ చిట్కాలతో కీళ్ల నొప్పులకు చెక్..

Knee Pain Relief : జనరల్‌గా వయసు పైబడిన వారు మాత్రమే రకరకాల నొప్పులతో బాధపడుతుండే వారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అతి చిన్న వయసులోనే రకరకాల అనారోగ్యాల బారిన ప్రజలు పడుతున్నారు. ఇకపోతే శీతాకాలంలో చాలా మంది కీళ్ల నొప్పుల బారిన పడుతుండటం మనం చూడొచ్చు. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతుంటారు. కాగా, ఈ చిట్కాలు ఫాలో అయితే కనుక ఆ సమస్యలన్నిటికీ చెక్ పెట్టొచ్చు. అవేంటో తెలుసుకుందాం.

కీళ్ల నొప్పుల నుంచి నయం చేసుకునేందుకుగాను ఆయుర్వేదంలో చాలా చిట్కాలు చెప్పబడి ఉన్నాయి. ఈ చిట్కాలను ఇంటి లోపల ఫాలో అయితే చాలు..మీ కీళ్ల నొప్పులు నయమవుతాయి. చల్లటి, వేడి నీళ్లతో స్నానం చేయడం ద్వారా కీళ్ల నొప్పులన్నీ తగ్గిపోతాయి. శరీరంలోని ఏదేని ప్రదేశంలో వాపు ఎక్కువగా ఉన్నట్లయితే ఐస్ ముక్కను ఆ ప్రాంతంలో పెట్టి మర్దన చేసుకోవాలి. అల్లంలో నొప్పి, వాపు తగ్గించే లక్షణాలుంటాయి. కాబట్టి అల్లం నూనెను శరీరంలోని కీళ్ల నొప్పులున్న ప్రాంతాలకు అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేసుకున్నట్లయితే నొప్పులు తగ్గిపోతాయి.

పసుపులో ఉండే కర్కుమిన్ అనే మూలకం కూడా దీర్ఘకాలిక గాయాలను, కీళ్ల నొప్పులను నయం చేస్తుంది. అయితే, పసుపు ఒక్కటే కాకుండా దానికి అల్లం కలుపుకుని ఆ మిశ్రమాన్ని కీళ్లపై రాసుకోవాలి. అలా చేయడం ద్వారా చక్కటి ఉపయోగాలుంటాయి. ఒక టీ స్పూన్ పసుపులో అర టీ స్పూన్ అల్లం కలుపుకుని ఆ మిశ్రమాన్ని బాగా ఉడికించి ప్రతీ రోజు రెండు లేదా మూడు సార్లు అప్లై చేసుకున్నట్లయితే కీళ్ల నొప్పులు, వాపు తగ్గిపోతాయి. ప్రతీ రోజు ఆ మిశ్రమాన్ని తాగినా కూడా చాలా చక్కటి ప్రయోజనాలుంటాయి.

ఉసిరి, బొప్పాయిని కూడా తీసుకోవాలి. వాటిని తీసుకోవడం వలన చాలా ఉపయోగాలుంటాయి. ఇకపోతే ఉప్పులో ఉండే మెగ్నిషియం, సల్ఫేట్ కూడా నొప్పిని నివారించే శక్తిమంతమైన ఆయుధాలుగా ఉంటాయి. స్నానం చేసే ముందర నీటిలో ఒక టీస్పూన్ రాతి ఉప్పును కలుపుకోవాలి. ఆ తర్వాత స్నానం చేస్తే మంచి ఉపయోగాలుంటాయి.

Read Also : Marigold Flower Health Benefits : బంతి పూలు, ఆకులతో అనారోగ్య సమస్యలకు చెక్..!