Ranapala Leaf Benefits : ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆరోగ్యానికి ప్రయారిటీ ఇస్తున్నారు. బయట దొరికే ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. కరోనా సాధారణ మానవుని జీవన విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. బయట తీసుకునే ఫుడ్ విషయంలో చాలా జాగ్రతలు తీసుకుంటున్నారు. బయట పరిస్థితులు బాలేకపోవడంతో ఆరోగ్యాన్ని ఆస్పత్రుల్లో కొనుక్కునే బదులు ఇంట్లోనే పెంచుకుంటే మంచిదని అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు. అందుకోసమే ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉండే ఆహారాన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుంటున్నారు.
Ranapala Leaf Benefits : ఆరోగ్య సమస్యలకు మంచి ఔషధం
ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులకు గురైనప్పుడు పెద్దలు ఆకు పసరు వాడాలని సలహా ఇస్తుంటారు. ప్రజెంట్ జనరేషన్ వారు మాత్రం దానికి చీప్‌గా చూస్తారు. ఇంగ్లీష్ మందులు వాడేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ కొన్ని వ్యాధులకు ఇంగ్లీష్ మందుల కంటే ఆకు పసరు త్వరగా ఫలితం చూపిస్తుంటుంది. అలాంటి వాటిలో రణపాల ఆకుల రసం ఒకటి. దీనిని వాడటం వలన అనేక ఆరోగ్య ప్రయోజలున్నాయి.

ranapala-leaf-benefits-lots-of-health-benefits-with-ranapala-leaves
కిడ్నీల్లో రాళ్లు కరిగించడంతో పాటు పైల్స్ సమస్యకు ఈ ఆకు రసం ఎంతో ఉత్తమం.. రణపాల ఆకులను ఉదయం లేదా సాయంత్రం తిన్నా.. 30ఎంఎల్ మోతాదులో కాషాయం లాగా తాగిన మంచి ఫలితం ఉంటుంది. కిడ్నీళ్లో రాళ్లు కరుగుతాయి. పైల్స్ సమస్యకు తొందరగా ప్రయోజనం చేకూరుతుంది. దీని రసాన్ని నుదుటి పై రాసుకుంటే తల నొప్పి తగ్గుతుంది.
శరీరంలో వాపులు, కొవ్వు పేరుకుపోయి గడ్డలాగా అయితే వాటికి చెక్ పెడుతుంది. వేడి కురుపులను కూడా నివారిస్తుంది. గాయాలు అయిన చోట ఈ రసం రాస్తే వెంటనే తగ్గుతాయి. డయాబెటీస్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. రణపాల ఆకులు తాజావి రోజు రెండు నుంచి మూడు తింటే శరీరంలోకి విషరసాయనాలు బయటకు పోతాయి. మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
Read Also : Corriander Benefits : ధనియాలతో డయాబెటిస్‌కు చెక్.. బ్లడ్ షుగర్ లెవల్స్ ఇలా నియంత్రణ..!