...

Monkey pox : మంకీపాక్స్ వ్యాధి అలాంటి వారికి ఎక్కువగా వ్యాపిస్తుందా.. ఈ వ్యాధి లక్షణాలివే?

Monkey pox : గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా మహమ్మారి నుంచి ఇంకా కోలుకోకముందే ప్రపంచానికి మంకీపాక్స్ రూపంలో మరొక ముప్పు ముంచుకొస్తోంది. రోజు రోజుకి ఈ మంకీపాక్స్ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మొదటిసారిగా బ్రిటన్లో మంకీపాక్స్ కేసు నమోదు అయ్యింది. ఆ తరువాత ఈ వ్యాధి అంతకంతకూ విస్తరిస్తూ పలు దేశాల్లో కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ ఈ వ్యాధి సోకిన వ్యక్తికి సన్నిహితంగా మెలిగిన వ్యక్తులను 21 రోజులపాటు అసోసియేషన్ లో ఉండాలని సూచించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

Monkey pox
Monkey pox

ఆ వ్యాధి సోకిన వ్యక్తి తో సంబంధం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి తప్పకుండా ఐసోలేషన్ లో ఉండాలి అని అధికారులు సూచిస్తున్నారు. అటువంటి వ్యక్తులు ఉంటే మూడు వారాల పాటు బయట తిరగవద్దు అని స్పష్టం చేస్తున్నారు. మంకీపాక్స్ అంటే ఏమిటి అన్న విషయానికి వస్తే.. ఈ వ్యాధి సోకిన తర్వాత మొదట ప్రారంభదశలో తలనొప్పి,జ్వరం, వాపులు,నడుం నొప్పి, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత చర్మంపై దద్దుర్లు లేదా పొక్కులు లాంటివి కనిపిస్తాయి. అనంతరం చర్మం ఎర్రగా కందినట్టు అయ్యి ఆ తర్వాత అవి బొబ్బలుగా మారుతాయి. సాధారణంగా ఈ వ్యాధి 14 రోజుల నుంచి 21 రోజుల లోపు దానంతట అదే తగ్గిపోతుంది.

ఇకపోతే ప్రస్తుతం యూరప్ లో బయటపడిన ఈ కేసుల్లో స్వలింగ సంపర్కుల అయినా పురుషుల్లో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఇది పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తున్న మాట నిజమే కానీ ఇది గే వ్యాధి కాదు. కేవలం పురుషులకు మాత్రమే కాకుండా ఎవరికైనా సోకవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. మంకీపాక్స్ వ్యాధి సోకడానికి వ్యాపించడానికి కేవలం లైంగికంగా దగ్గర కావాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వ్యాధి స్వలింగసంపర్కుల లో ఎక్కువగా కనిపించడానికి ఒక కారణం, ఈ వ్యాధి లక్షణాలు కనిపించగానే వాడు మరింత చురుకుగా మారడం కావచ్చు అని డబ్ల్యుహెచ్ ఓ నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : Health: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా.. అయితే ఇది అదే కావచ్చు వెంటనే అలర్ట్ అవ్వండి?