Pumpkin Benefits : వయసు పైబడుతున్న కొద్దీ మనల్ని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఎంతో బలమైన ఆహారం తీసుకోవటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గించవచ్చనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అధిక పోషక విలువలు ఆరోగ్య ప్రయోజనాలను కలిగినటువంటి ఈ ఆహార పదార్థాలను తినటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇలా ఎన్నో పోషక విలువలు కలిగిన వాటిలో గుమ్మడి ఒకటి.

Pumpkin Benefits
గుమ్మడి కాయలు ఎన్నో రకాల పోషక విలువలు దాగివున్నాయి.గుమ్మడి తినటం వల్ల పోషక విలువలు మన శరీరానికి ఎన్నో రకాల వ్యాధులను నయం చేస్తుంది. గుమ్మడికాయలో మాత్రమే కాకుండా గుమ్మడి గింజలలో కూడా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. గుమ్మడి కాయలో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉండటం వల్ల తొందరగా ఆకలిని కలిగించదు తద్వారా శరీరం బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఇందులో సెరటోనిన్ అనే రసాయనం ఉండటం వల్ల నిద్ర కలిగించటానికి దోహదపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు తరచూ గుమ్మడిని తినటం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
గుమ్మడి గింజలు మెగ్నీషియం, ఫ్యాటి యాసిడ్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అలాగే మన శరీరంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచడానికి దోహదపడుతుంది. గుమ్మడి గింజలు వాటిలో కొల్లాజెన్ ఉండటం వల్ల గాయాలను నయం చేయటానికి దోహద పడతాయి. గుమ్మడి గింజలలో కుకర్బిటన్ అనే అమైనో యాసిడ్స్ జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి.
ఇకపోతే గర్భిణీ స్త్రీలు గుమ్మడి పండ్లను బాగా ఉడికించి సూప్ లేదా కూరతినడం వల్ల శరీరానికి కావల్సిన ఐరన్ సమృద్దిగా లభించి బిడ్డ ఎదుగుదలకు దోహదపడుతుంది. అయితే కొందరి క్యాన్సర్ పేషెంట్లకు గుమ్మడికాయ సరిపోదు.క్యాన్సర్ పేషెంట్ గుమ్మడి కాయ తినడం వల్ల వీటిలో ఉన్న అధిక ఫైబర్ కారణంగా విరేచనాలు అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే క్యాన్సర్ పేషెంట్లు ఎవరికైతే గుమ్మడి సరిపోదో అలాంటివారు గుమ్మడికి దూరంగా ఉండటం మంచిది.
Read Also : Healthy tips : మీ ఎముకలు ఇనుములా గట్టిగా మారాలంటే ఈ ఆకు కూర తినాల్సిందే..!