Acharya Bhale Bhale Bhanjara Song : మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి ‘భలే భలే బంజారా’ అనే గీతం ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ సంభాషణతో కూడిన టీజర్ వీడియో రిలీజ్ చేసిన చిత్ర బృందం.. తాజాగా ఈ పాటకు సంబంధించిన గ్లింప్స్ వీడియో పంచుకుంది.
‘సిరుత పులుల సిందాట’ అంటూ సాగే ‘భలే భలే బంజారా’ గీతం ప్రోమో వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొ కంపెనీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పూర్తి పాటను సోమవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది. ‘భలే భలే బంజారా’ గీతానికి మణిశర్మ బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ప్రోమోలో చిరంజీవి, రామ్చరణ్ స్టెప్పులతో అదరగొట్టారు. అయితే ఈ సినిమా ఈనెల 29వ తేదీన విడుదల కాబోతోంది.

దేవాలయాల నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్గా చేసింది. రామ్చరణ్, పూజాహెగ్డే కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలు, టీజర్లు మెగా అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి.
Read Also : Megastar Chiranjeevi: ట్విట్టర్ పేరు మార్చుకున్న మెగాస్టార్… మనసును హత్తుకునే వీడియో షేర్ చేసిన చిరు!