...

ఈ మూలికతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

వస అనేది ఒక రకమైన ఔషధ మొక్క. దీన్ని ఎన్నో వందల సంవత్సరాల నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు. వసకొమ్ము గొంతులోని కఫం తొలగించడమే కాదు మాటలు స్పష్టంగా రావడానికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తారు. పల్లెటూర్ల లో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు పుట్టడంతోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు. ఇప్పటికీ ఈ సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది.వస వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణాశయంలో వేడిని పుట్టించి, అల్సర్లు,గ్యాస్,అసిడిటీ సమస్యలకు చెక్ పెడుతుంది. అజీర్ణం,మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు వస చూర్ణం తీసుకుంటే ఆ సమస్యలు తగ్గటమే కాకుండా ఆకలి లేని వారిలో ఆకలి కూడా పుడుతుంది. నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పరచడంలో సహాయపడి ఆందోళన,ఒత్తిడిని దూరం చేస్తుంది.వస కొమ్ములను పాలలో వేసి మరిగించి కనీసం ఒక నెల పాటు తీసుకుంటే జ్ఞాపకశక్తి సమస్యలు తగ్గడమే కాకుండా వయసు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ కూడా తగ్గుతాయి. అలాగే కంఠస్వరం బాగుంటుంది.

వస కొమ్ముల పొడిని ఆవనూనెతో కలిపి రాసుకుంటే శరీరభాగాలపై ఏర్పడే వాపులు,నొప్పులు తగ్గు ముఖం పడతాయి. వస చూర్ణం అయితే రోజుకు ఒకటి నుండి రెండు చిటికెలు తీసుకోవచ్చు. భోజనం చేసిన తర్వాత తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. వస క్యాప్సల్స్ రూపంలోనూ లభిస్తుంది. వసలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండటం వలన చర్మ సమస్యలకు బాగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ వస చూర్ణాన్ని తీసుకొని నీళ్లు కలిపి పేస్టులా తయారుచేసి చర్మంపై సమస్య ఉన్న చోట రాస్తే తొందరగా ఉపశమనం లభిస్తుంది. వస కొమ్మును తీసుకునే ముందు ఒకసారి ఆయుర్వేద వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.