Health Tips: మన శరీరంలో రక్తనాళాల పనితీరు చాలా ప్రధానమైనది. శరీరంలోని అన్ని అవయవాలు భాగాలకు రక్త నాళాల ద్వారా రక్తం , ఆక్సిజన్, పోషకాలు అందుతాయి.మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే మన రక్తనాళాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. కానీ ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను దూరంగా ఉంచడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడవచ్చు.
సాధారణంగా ప్రస్తుత కాలంలో అందరూ ఫాస్ట్ ఫుడ్, జింక్ ఫుడ్ తినటానికి బాగా ఆసక్తి చూపుతారు. ఇవి తినడానికి చాలా రుచిగా ఉన్నా కూడా వీటిని ఎక్కువగా తినటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.ఇటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్త సరఫరా సరిగా జరగదు. అందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
పాలు మరియు పాల ఉత్పత్తులలో కూడా కొవ్వు శాతం అధికంగా ఉంటుంది.వీటిని ఎక్కువగా తినటం వల్ల కూడా రక్తనాళాల్లో చెడు కొవ్వు పేరుకుపోయి రక్తనాళాలు బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. నూనెలో ఎక్కువగా డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తరచూ తినటం వల్ల రక్తనాళాల్లో చెడు కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఈ మధ్య కాలంలో అందరూ మద్యపానానికి బాగా అలవాటు పడ్డారు. ప్రతి రోజూ ఎక్కువ మోతాదులో మద్యం తాగటం వల్ల కూడా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి లివర్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.