...

Health tips: చిక్కుడుకాయ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Health tips: చిక్కుడు కాయ మంచి పౌష్టిక పదార్థాలు ఉన్న కూరగాయ. ఇందులో ఉన్న పోషకాలు మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదపడతాయి. చిక్కుడు కాయ కూర అంటే చాలా మంది ఇష్టంగా తింటారు. ఒకప్పుడు అయితే ప్రతి ఇంట్లో చిక్కుడు తీగ ఉండేది. ఈ మధ్య కాలంలో ఇంట్లో చిక్కుడు సాగు చేయడం కాస్త తగ్గినప్పటికీ దానిపైన మమకారం మాత్రం అప్పుడు ఇప్పుడూ ఒకే రకంగా ఉంది. అయితే చిక్కుడుతో చేసిన కూరను తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

చిక్కుడు కాయలతో చేసిన కర్రీ తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. అంతే కాకుండా నిద్రలేమి, ఒత్తిడి లాంటి సమస్యలను దూరం చేస్తుంది. చాలా మంది మహిళలు రక్త హీనతతో బాధ పడుతుంటారు. అలాంటి వారికి చిక్కుడు కాయ దివ్యౌషధం అనే చెప్పాలి. ఎందుకంటే చిక్కుడు కాయ తింటే రక్త హీనత తగ్గుముఖం పడుతుంది.

జీర్ణ క్రియను సాఫీగా మార్చడంలో చిక్కుడు ఎంతో బాగా తోడ్పడుతుంది. చిక్కుడు మెదడు పని తీరును కూడా మెరుగు పరుస్తుంది. పందిరి చిక్కుడును తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా పండిస్తారు. అలాగే తమిళనాడు, కర్ణాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలలో చిక్కుడు సాగు చేస్తారు. ఈ మధ్య కాలంలో ఉత్తర భారత దేశంలో ప్రాచుర్యం పొందుతోంది. పందిరి చిక్కుడులో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ప్రతి వంద గ్రాముల చిక్కుడు 48 కేలరీల శక్తిని ఇస్తుంది.