...

Sarkaru vaari pata review: సర్కారు వారి పాట మెప్పించిందా… మిల్క్ బాయ్ ఎలా చేశాడు?

Sarkaru vaari pata review: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూసిన చిత్రం రానే వచ్చేసింది. టాలీవుడ్ స్టార్ హీరో, కీర్తి సురేష్ జంటంగా నటించిన సర్కారు వారి పాట సినిమా కొద్ది గంటల క్రితమే రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దర్శకుడు పరశురామ్ తనదైన స్టైల్ లో చాలా కూల్ గా సాగేలా చిత్రాన్ని తెరకెక్కించారు. మధ్య మధ్యలో మాస్ డైలాగ్ లను పేలుస్తూ.. మిల్క్ బాయ్ మహేళ్ బాబు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అటు క్లాసుతో పాటు మాస్ ఇమేజ్ ని మిక్స్ చేసి… మంచి హిట్టు సినిమాను మహేష్ బాబు ఖాతాలో వేశారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు నోటి నుండి వచ్చే ప్రతీ డైలాగ్ సూపర్ గా పేలింది.

Advertisement

Advertisement

అయితే ఈ సినిమాలో కామెడీకే పెద్ద పీట వేశారు డైరెక్టర్ పరశురామ్. ముఖ్యంగా మహేష్, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ ల మధ్య వచ్చే సీన్లన్నీ అదిరిపోయాయి. ఇవి చూసి ప్రతీ ఒక్కరూ హాయిగా నవ్వుకోవచ్చు. చాలా రోజుల తర్వాత మళ్లీ మనం మహేష్ బాబులో ఓ పండుని చూడచ్చు. అయితే మహేష్, కీర్తిల లవ్ ట్రాక్ అదిరిపోయింది. కళావతికి విలన్ కి సంబంధంలో సూపర్ ట్విట్స్ ఇచ్చాడు డైరెక్టర్ పరశురాం. ఇక ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ తమన్ మ్యూజిక్. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థియేటర్లో ఉన్న అభిమానులకు గూస్ బంప్స్ రప్పించాడు.

Advertisement

అంతే కాదండోయ్ ఇంటర్వెల్ ట్విట్స్ మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుంది. ఎవరూ ఊహించని రీతిలో ట్విస్ట్ ని సెట్ చేశాడు డైరెక్టర్. ఇక రామ్ లక్ష్మణ్ ల ఫైట్ గురించి వివరించాల్సిన పనే లేదు. కథ కొంచెం సాగదీసినా మధ్య మధ్యలో కామెడీతో నెట్టుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా ఓ యాక్షన్ రివెంజ్ డ్రామా. ఇలాంటి కథలు మనం ఎన్నో చూసినప్పటికీ… డైరెక్టర్ కొత్తగా చూపించారు. చివరగా ఈ సినిమా అభిమానులకు రివర్స్ లేని ఆట.. సర్కారు వారి పాట.

Advertisement
Advertisement