...

Diabetes Remedy : మీకు షుగర్ పెరుగుతుందనే భయం వద్దు.. నిమ్మరసంతో చిటికెలో కంట్రోల్ చేయొచ్చు!

Diabetes Remedy : మధుమేహం.. ఈ మధ్య కాలంలో చాలా మంది బాధ పెడుతున్న తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఎవరిని కదిలించినా.. షుగర్ ఉందని చెబుతున్నారు. షుగర్ ఉన్న వాళ్లు ఏది పడితే అది తినలేరు. చాలా వరకు ఎంచుకున్న ఐటెమ్స్ మాత్రమే తింటారు. ఆహారంలో షుగర్ లేకుండా చూసుకుంటారు. షుగర్ ఎక్కువగా ఉన్న వారు అయితే.. కనీసం అన్నం కూడా తినలేరు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెరను నియంత్రించడం చాలా ముఖ్యం. అది పరిమితి మించి ఉంటే పెద్ద సమస్యగా పరిగణించాల్సి ఉంటుంది. శరీరంలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ లోపం ఉన్నప్పుడు, అంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తక్కువ ఉంటే.. రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుంది. ఈ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనేది శరీరంలోని జీర్ణ గ్రంథి ద్వారా ఉత్పత్తి అయ్యే హార్మోన్. ఇది ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది.

నిమ్మకాయతో మధుమేహాన్ని ఎలా నియంత్రించవచ్చో ఇప్పుడు చూద్దాం. నిమ్మయాకలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే గొప్ప ఆహార పదార్థం ఇది. ఇందులో విటమిన్ సి తో పాటు విటమిన్ ఎ, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్లు వంటి పోషకాలు ఉంటాయి. నిమ్మకాయలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు పెద్ద మొత్తంలో ఉంటాయి. నిమ్మకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది.

రోజూ భోజనానికి గంట ముందు ఒక గ్లాసు నిమ్మరసం తాగితే బరువు అదుపులో ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తింటే కూడా మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. ఫ్రూట్ సలాడ్ తీసుకుంటే కనుక అందులో ఒక నిమ్మకాయ నుండి తీసిన రసాన్ని కలుపుకోవచ్చు. రుచికి రుచిగా ఉంటుంది. అలాగే శరీరానికి ఆరోగ్యం చేకూరుతుంది.

Read Also : Plants: ఈ మొక్కలు ఇంట్లో పెంచారంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పని తప్పుతుంది..!