Big Boss 6 Revanth : బిగ్ బాస్ హౌస్ అంటే అల్లరి అల్లరిగా.. ఎప్పుడూ అలకలు, గొడవలు ఉంటాయి. కంటెస్టెంట్లు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా.. లేని సమయంలో మరోలా ప్రవర్తిస్తుంటారు. అక్కడి మాటలు, ఇక్కడ.. ఇక్కడి మాటలు, అక్కడా చెబుతూ వారి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. మోసాలు చేయడం, మోస పోవడం బిగ్ బాస్ హౌస్ లో సాధారణంగా జరిగే విషయం. వారితో పాటే ఉంటూ వారికే నష్టం చేస్తుంటారు. అదే బిగ్ బాస్ గేమ్ అంటే. బిగ్ బాస్ హౌస్ లోని వెళ్లి సైలెంట్ గా, తన పని తాను చేసుకుంటూ గేమ్ ఆడతానంటే కుదరదు. గొడవలు పెట్టుకునే వాళ్లే వారికి కావాలి.
ఎప్పుడూ ఎదుటి వారితో కలహం జరుగుతూ ఉండాలి. లేదంటే కనీసం అమ్మాయిలు అబ్బాయిలతో.. అబ్బాయిలు అమ్మాయిలతో రొమాన్స్ చేయాలి. అమ్మాయిలైతే చిట్టి పొట్టి బట్టలతో కనిపించి కవ్వించాలి. అలాంటి వారు గేమ్ ఆడకపోయినా చివరి వరకు హౌస లోనే ఉంటారు. పద్ధతిగా ఉంటా.. నా గేమ్ నేను ఆడుకుంటా అంటే బిగ్ బాస్ హౌస్ లో కుదరదు.
Big Boss 6 Revanth : బోరుమని ఏడ్చేసిన రేవంత్..
ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నడుస్తోంది. ఇప్పటికే ఒక వారం ఎలిమినేషన్ కూడా అయిపోయింది. అయితే నామినేషన్ ప్రక్రియలో మిగతా కంటెస్టెంట్లు చాలా లైట్ తీసుకోగా.. సింగర్ రేవంత్ మాత్రం తెగ ఫీలైపోతున్నాడు. తనను నామినేట్ చేసినందుకు తెగ హర్ట్ అవుతున్నాడు. ఈ ఫ్రస్టేషన్ ను ఇతర కంటెస్టెంట్ ల పై చూపిస్తున్నాడు. రేవంత్ పై గీతూ జోకులు వేస్తూ ఆటపట్టిస్తోంది. తర్వాత తనను గేమ్ ఆడనివ్వలేదని ఆరోహిపై చిరాకు పడ్డాడు రేవంత్. ఆ సమయంలోనే కెమెరా ముందుకు వచ్చి నా వల్ల ప్రాబ్లం అనుకుంటే నన్ను పంపించి వేయండి అంటూ తెగ ఫీల్ అయ్యాడు.
Read Also : Bigg Boss 6 : కెప్టెన్సీ కోసం దిగజారిపోయిన గలాటా గీతు.. ఛీకొడుతున్న ప్రేక్షకులు..?