Cockroaches Drink Beer : బీరు.. ఈ పేరు వింటేనే బీరు ప్రియులకు కిక్కు ఎక్కేస్తుంది.. అసలీ ఈ బీరును ఎలా తయారుచేస్తారో తెలుసా? చాలామందికి బార్లీ గింజలతోనే బీర్ తయారుచేస్తారని తెలిసి ఉంటుంది. అందుకే అంత రుచిగా ఉంటుందా? అయితే అంతకుమించి రుచికరమైన బీరు ఒక్కొటి ఉంది. ఇప్పుడీ బీరు కోసం జనమంతా క్యూ కట్టేస్తున్నారట.. అదే.. బొద్దింకల బీరు.. అబ్బే.. బొద్దింకలతో బీరా? ఛీ.. అనిపిస్తుందా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం..
జపాన్‌లో బీరును బొద్దింకలతోనే తయారుచేస్తారంట.. సూపర్ టేస్టీగా ఉంటుందట కూడా.. బొద్దింకలను బాగా ఉడకబెడతారట.. అలా రసం తీసి బీరును తయారుచేస్తారట.. ఇప్పుడా బీరు కోసం జనమంతా క్యూ కట్టేస్తున్నారట.. తైవాన్‌లో ఎక్కువగా లభ్యమయ్యే మగ బొద్దింకలనే బీరు తయారీకి ఉపయోగిస్తారట.. ఈ మగ బొద్దింకలు ఎక్కువగా నీళ్లలో ఉంటాయట.. నీళ్లపై ఉండే కీటకాలు, చేపలు, క్రిమికీటకాదులను తిని ఈ మగ బొద్దింకలు జీవిస్తుంటాయి.. బీరు తయారీ కోసం ముందుగా మగ బొద్దింకలను సేకరించి నీళ్లల్లో కొన్నిరోజుల పాటు ఉడికిస్తారట..
అలా రసాన్ని తీసిన తర్వాత బీరును తయారుచేస్తారట.. దీనికి ఓ పేరు కూడా ఉందట.. కబుటోకామా.. ఈ ప్రాసస్ ప్రకారమే బీరు తయారుచేస్తారట.. తైవాన్ మగ బొద్దింకలకు జపాన్ లో ఫుల్ డిమాండ్.. అక్కడి జనమంతా లొట్టలేసుకుంటూ తినేస్తారు. బీరుతో కలిపి రుచికరమైన సూప్స్, వంటకాల్లో కూడా బొద్దింకలతో వేసి తయారుచేస్తారట.. బొద్దింకలను రొయ్యలుగా పిలుస్తారు.. ప్రతిరోజూ బొద్దింకలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని, ఎక్కువకాలం బతుకుతారని జపనీస్ విశ్వాసం.. బొద్దింక సూప్ తో పాటు బొద్దింకల బీరుకు ఫుల్ డిమాండ్ పెరిగింది.
సోర్ బోర్ గా మార్కెట్లో ఫుల్ డిమాండ్ పలుకుతోంది. ఒక్కో బీరు బాటిల్ ఖరీదు.. మన దేశీ కరెన్సీలో రూ.300 నుంచి ఉంటుందట.. హాంకాంగ్ తూర్పు, చైనా, జపాన్, ఆగ్నేయ ఆసియా దేశాల్లో పురుగులనే ఆహారంగా తినేస్తుంటారు. పురుగులతోనే కొత్త వెరైటీ వంటకాలను ట్రై చేస్తుంటారు. పురుగుల్ని ఫ్రై చేసుకొని పకోడీలా తినేస్తుంటారు. తేళ్లను రొయ్యలు తిన్నట్టుగా తినేస్టుంటారు. మనకు విచిత్రంగా ఉండొచ్చు కానీ.. చైనా సహా జపాన్ దేశాల్లో ఇది చాలా కామన్..
Read Also : Ashu Reddy Comments RGV : సెక్స్ విషయంలో అషురెడ్డి బోల్డ్ కామెంట్స్.. అందుకే ఆర్జీవీ ఇష్టమట..!