Aquafaba Water Health Benefits : కొందరు పెద్ద శనగలను నానబెట్టాక వాటిని వేరు చేసి ఆ నీటిని పారబోస్తుంటారు. అయితే, ఆ నీళ్లలో ఎన్నో పోషక గుణాలు ఉంటాయట.. వాటిని పారబోయకుండా సరిగా వాడుకుంటే శరీరానికి ఎంతో మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మాంసంలో ఉండే కొవ్వు పదార్థాలు శనిగల్లో ఉంటాయని బహుశా మీకు తెలియకపోవచ్చు. నాన్ వెజ్ తినని వారికి ఈ శనిగలు తమ శరీరానికి అవసరమయ్యే మాంసకృత్తులను అందిస్తాయి.
సాధారణంగా పెద్ద శనగలు మనకు వంటింట్లో చాలా రకాలుగా ఉపయోగపడే కొవ్వు పదార్థం.. శనగలతో ఏదైనా మనకు నచ్చిన ఫుడ్ తయారు చేసుకునే ముందు ఓ గిన్నెలో నీరు పోసి రాత్రంతా నానబెట్టాలి. దీంతో అవి సాధారణంగా ఉన్న పరిమాణం కంటే పెద్దగా తయారవుతాయి. వాటితో అనేక రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం చేసే తప్పు ఎంటంటే నానబెట్టిన నీటిని పారబోయడమే. కానీ ఇందులో చాలా పోషక పదార్థాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
శనిగలు నానబెట్టిన తర్వాత మిగిలిన వాటర్‌ను ‘అక్వాఫాబా లేదా చీక్‌పీ వాటర్’ అని పిలుస్తారు. వెజ్‌టేరియన్స్ మాసం, కోడిగుడ్లు తినరు. అలాంటి వారికి ఈ చీక్ పీ వాటర్ ‘ఎగ్ వైట్’కు బదులుగా పనిచేస్తుంది. అంతటి పోషకగుణాలు ఇందులో ఉన్నాయట..
చిక్ పీ వాటర్ ఎలా తయారు చేసుకోవాలంటే.. గుప్పెడు పెద్ద శనగలు తీసుకుని ఒక గిన్నెలో నీరు పోసి 4 నుంచి 7 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని వడపోసుకోవాలి. అంతే Aquafaba రెడీ. ఒకవేళ మీరు శనగలు ఉడకబెట్టుకోవాలంటే మళ్లీ ఈ నీటిని కూడా వాడుకోవచ్చు. ఈ వాటర్ తీసుకోవడం వలన ఏం జరుగుతుందంటే.. విటమిన్ డి, ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు అనగా లినొలెనిక్ లేదా ఒలిక్ యాసిడ్ లాంటివి లభిస్తాయి. శాఖాహారులకు ఎగ్ వైట్ తింటే ఎంత ప్రయోజనం కలుగుతుందో ఈ చిక్ పీ వాటర్ వలన కూడా అంతే కలుగుతుంది.