Brushing Tips : ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసిన తర్వాతే మనం ఏ పనైనా ప్రారంభిస్తాం. కొందరు దంతాలను శుభ్రం చేయకుండానే బెడ్ కాఫీ లాంటివి తాగే అలవాటు ఉంటుంది. సంపన్నుల ఇంట్లోని వ్యక్తులకు మాత్రమే ఇలాంటి అలవాట్లు ఉంటాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో జీవించే వారంతా పొద్దున్న బ్రష్ చేశాకే టీ తాగడం, టిఫిన్ చేయడం, కాలకృత్యాలు తీర్చుకోవడం వంటివి చేస్తుంటారు.
అయితే, రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలని వైద్యులు చెబుతుంటారు. దీనివలన పంటిపై, చిగుళ్లపై పేరుకుపోయిన బ్యాక్టీరియా తొలగిపోయి దంతాలు, నోరు శుభ్రంగా ఉంటాయని చెబుతుంటారు. ఒకవేళ బ్రష్ చేయడం వీలు కాకపోతే మౌత్ వాష్ అయినా వాడాలని సజెస్ట్ చేస్తుంటారు. దీని వలన నోటిలో నుంచి దుర్వాసన రాకుండా ఉండటమే కాదు.. దంతాలు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయట..
1970లో రెండు నిమిషాల పాటు పళ్లను తోమాలని వైద్యులు సూచించేవారు. క్రమంగా కాలం మారుతున్న కొద్దీ రెండు నుంచి ఎక్కువ సేపు బ్రష్ చేయడం వలన నోట్లోని క్రిములు మొత్తం శుభ్రం అవుతాయని తెలిపారు.అంతేకాకుండా పళ్లు తోమేటప్పుడు మృదువైన బ్రష్ ఉపయోగించాలట.. గంటల తరబడి బ్రష్ మాత్రం అస్సలు చేయకూడదు. కొందరు బ్రష్ వేసుకుని తోముకుంటూనే తమ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. మార్కెట్ వెళ్తారు. పేపర్ చదువుతారు. ఇలా చేయడం వలన చిగుళ్లతో పాటు దంతాలు కూడా అరిగే అవకాశం ఉందని డెంటిస్టులు చెబుతున్నారు.
బ్రష్ చేయడం కలిగే ప్రధాన ఉపయోగం ఎంటంటే.. దంతాలపై నుండే నల్లని మరకలు, మచ్చలు, ఆహారం తీసుకున్నప్పుడు అందులో ఇరికే పదార్థాలు, జెర్మ్స్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌లు, ఏదైనా డ్రింక్స్, జ్యూసెస్ తాగినపుడు కొంత మన దంతాలపై పేరుకుపోతుంది. రెండు నుంచి నాలుగు నిమిషాలలోపు బ్రష్ చేస్తే దంతాలపై, చిగుళ్లపై ఉన్న క్రిములు మొత్తం క్లీన్ అవుతాయి. ఫలితంగా ఎలాంటి దంత, చిగుళ్ల, నోటి సమస్యలు రాకుండా ఉంటాయి. నోరు శుభ్రంగా ఉంటేనే కడుపు శుభ్రంగా ఉంటుంది. ఫలితంగా మనం తినే ఆహారం సులువుగా జీర్ణమై ఆరోగ్యంగా ఉండటానికి ఆస్కారం ఏర్పడుతుంది.
Read Also : Health Tips : గొంతునొప్పి వేధిస్తుందా..? అయితే ఈ చిట్కా ట్రై చేయండి.. క్షణాల్లో తగ్గిపోతుంది..!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world