Actress Rohini: నటి రోహిణి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా, సామాజిక కార్యకర్తగా, రచయితగా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అయితే బాల్య నటిగా సినీరంగంలో అడుగు పెట్టిన ఈమె తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించి మెప్పించింది. అనేక సినిమాల్లో పిన్ని, అమ్మ, చెల్లిగా నటించి మార్కులు కొట్టేసింది. అయితే చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రితో పాటు విశాఖపట్నం నుంచి చెన్నైకి వచ్చేసింది. తండ్రికి సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఈమె కూడా సినీ రంగంలోకి అడుగు పెట్టింది.
బాల నటిగా కెరియర్ ప్రారంభించినా హీరోయిన్ గా కూడా పలు సనిమాలు చేసింది. అక్కడే రఘువరన్ తో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. 1996లో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేస్కున్నారు. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. ఆ తర్వాత అంటే 2003లో పలు కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. తర్వాత సినిమాల్లో కనిపించలేదు.
కానీ చాలా కాలం తర్వాత కమల్ హాసన్ సినిమా పోతురాజులో పరిశఓధకురాలు పాత్రలో నటించి మెప్పించింది. అలా మొదలైంది సనిమాలో నాచురల్ స్టార్ నానికి తల్లిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. 2005లో సాహిత్య అకాడమీ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాల్లో పాల్గొంది. ఇలా సమాజ సేవు చేస్తూ.. వాహ్వా అనిపిస్తూ జీవితంలో ముందుకు సాగిపోతుంది నటి రోహిణి.