Minapappu Pachadi : మినపప్పుతో రోటి పచ్చడి తిన్నారా? ఇలా తయారు చేసి తిన్నారంటే నోరూరి పోవాల్సిందే. అంత కమ్మగా ఉంటుంది మరి. ఈ రోటి పచ్చడిలో కాంబినేషన్‌గా ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నారంటే అదిరిపోద్ది. ఈ మినపప్పు పచ్చడితో ఫస్ట్ ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత పచ్చిమిర్చిని తీసుకోండి. లభించి వేయడం వల్ల మనకి ఆయిల్‌లో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి. అలాగే పచ్చడి అనేది కొద్దిగా కారం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మీరు కారానికి తగ్గట్టు చూసుకోండి.
పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చిని అన్నింటిని ఏదైనా బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే ఆయిల్లో అర కప్పు మినప్పప్పు వేసుకొని నో ఫ్లేమ్ లో పెట్టి బాగా వేగనివ్వండి. మినప్పప్పు తొందరగా పైన కలర్ వస్తాయి. లోపల సరిగా వేగం అప్పుడు టేస్ట్ అంత బాగుండదు. పచ్చడి అందుకని లో ఫ్లేమ్‌లో పెట్టి నిదానంగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. పప్పు బాగా వేగుతుంది. లోపల వైపు కూడా బాగా వేగుతుంది. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అదొకటి గుర్తు పెట్టుకొని నిదానంగా బాగా వేయించుకోండి.
పప్పు ఎర్రగా వేగాలి. ఇలా వేయించుకున్న ఈ పప్పుని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే పాన్‌లో మరొక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్‌లో ఒక్క చిటికెడు మెంతులు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. మెంతులు బాగా ఎర్రగా వేగాలి. లేకపోతే మీకు లైట్‌గా చేతులు చేస్తున్నట్టు ఉంటుందండి. అందుకని మంచి ఫ్లేవర్ టేస్ట్ కావాలంటే మెంతుల్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి. మెంతులు ఇలా ఎర్రగా వేగిన తర్వాత మీడియం సైజు మూడు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి.
Minapappu Pachadi : మినపప్పుతో రోటి పచ్చడి తయారీ విధానం ఇలా :
అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి. టమాటాలు వేయండి. లైట్‌గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి టమాట ముక్కలు మొత్తాన్ని బాగా కలిపేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. ఫ్లేమ్ లో ఫ్లేమ్‌లో పెట్టి మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోండి. ఇప్పుడు ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా గుచ్చిన మొత్తాన్ని కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి ముక్కలు దీంట్లోనే ముందుగా వేయించి పెట్టుకున్న మినప్పప్పును కూడా వేసుకోవాలి. మీరు వచ్చి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి.
మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే పచ్చని రోడ్లో దంచుకోండి. ఎక్సలెంట్ గా ఉంటుంది. మిక్సీ జార్‌లో వేసే కన్నా కూడా ఈ పచ్చడి రోట్లో దంచి ఇంకా భలే ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ టమాటా గుజ్జుని కూడా వేసుకొని ఒక్క రెండు సార్లు దంచండి. పచ్చడి మరి మెత్తగా రుబ్బితే టేస్ట్ బాగుండదు. అదొకటి గుర్తు పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి. మనకి అమ్మిన పప్పు లైట్ పలుకుగా తగులుతూ ఉండాలి. అలా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది.
మీకు పచ్చడి కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది. ఇలా వద్దు గట్టిగా ఉంటే ఇష్టం ఉండదు అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు పక్కన పెట్టి పోపు కోసం దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు, మినపప్పు అన్ని కలిపి తీసుకున్నాను. ఆవాలు చిప్పట్లాడిందాక వేయించండి. ఖర్చు ఇప్పుడు ఆవాలు వేసిన తర్వాత అందులోనే ఒక 3 ఎండు మిరపకాయలు తీసుకుని వేసుకోండి.
అలాగే ఒక ఐదు, ఆరు వెల్లుల్లి రెమ్మలు కూడా కచ్చాపచ్చాగా దంచి వేసి వేయించుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా వేగిన తర్వాత ఒక బ్రహ్మ కరివేపాకు కూడా వేసి వేయించండి. మీకు ఇష్టం ఉంటే.. ఈ పోపులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇల్లు ఇష్టం ఉన్నవాళ్లు ఇంగువ వేసుకోండి. ఇలా కొంచెం మొత్తం వేగిన తర్వాత పోప్ చేసేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడి మొత్తాన్ని వేసుకొని దింట్లోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి.
ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కాకుండా మీరు పచ్చడి జార్లో గ్రైండ్ చేసుకున్నప్పుడు ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో ఆ హౌస్‌లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న సరిపోతుంది. రోట్లో దంచుకునే పని అయితే ఒక ఉల్లిపాయని డైరెక్ట్ రోట్లోనే వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు మనం రైస్‌తో కలుపుకొని తినేటప్పుడు పచ్చడి పంటి కింద అక్కడక్కడ తగులుతూ భలే ఉంటాయి. అంతే, మినప్పప్పుతో పచ్చడి రెడీ. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అదిరిపోద్ది. చాలా చాలా బాగుంటుంది. మినప్పప్పుతో రోటి పచ్చడి ఒకసారి ట్రై చేయండి.
Read Also : Thotakura Pesarapappu : తోటకూర పెసరపప్పు ఇలా కొత్తగా చేసి చూడండి.. లోట్టలేసుకుంటూ తినేస్తారు..!