Thotakura Pesarapappu : తోటకూర పెసరపప్పు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. ఇంతకీ ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసా? ముందుగా తోటకూర నాలుగు కట్టలు తీసుకోండి. ఇలా తీసుకున్న తోటకూర ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత నీటుగా కడిగేయండి. నాలుగు ఐదు సార్లు అన్న కడగండి. తోటకూరలో మట్టి ఉంటుంది. బాగా కడిగేసిన తర్వాత కట్ చేసుకోవాలి. కొద్దికొద్దిగా తోటకూర తీసుకొని మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. తోటకూర మొత్తాన్ని ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు తీసుకొని ఒక 15 నిమిషాలు నీళ్లలో నానబెట్టండి.
తయారీ విధానం ఇలా :
నానబెట్టుకుంటే పెసరపప్పు తొందరగా ఉడుకుతుంది. నానబెట్టిన పెసరపప్పుని ఒకసారి కడిగేసి నీళ్లు పారబోయాలి. పెసరపప్పు గిన్నెలోకి తీసుకోండి. ఈ పెసరపప్పు మునిగేంత వరకు ఇదే గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ పైనా పెట్టి ఉడికించండి. మరి మెత్తగా ఉడికించేసుకోవచ్చు. ముద్దలాగా అయిపోతుంది. ఇలా కాస్తా పలుకున ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్లని పారపోయండి. పెసరపప్పును తీసి పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు బాండిని వేడి చేసుకోవాలి. ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడి ఎక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు చిటపటలాడే వరకు వేయించేసిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంతవరకు వేయించుకోండి.
Thotakura Pesarapappu : తోటకూర పెసరపప్పు రుచిగా ఉండాలంటే.. :
ఒక రెండు నిమిషాలు వెయిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు రక్షించుకొని వేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ లో పెట్టి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. ఇలా కలుపుకునేటప్పుడు ఒక 1/2 టీస్పూన్ పసుపు కూడా వేసేసి బాగా కలపండి. మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టి ఉడకనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. మూత తీసి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి.

ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం తక్కువ తినే వాళ్ళు అయితే కొద్దిగా తగ్గించి వేసుకోండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకొని వీటన్నింటినీ కలిపి ఒక రెండు మూడు సార్లు పూర్తిగా ఫ్రై చేసుకోండి. మరీ మెత్తగా చేసేసారంటే ముద్ద లాగా వచ్చేస్తుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు మనకి ఆకు కూర కూడా బాగా వేగిపోతుంది. తొందరగానే వేగిపోతుంది. పెద్ద టైం కూడా పట్టదు. ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని తీసుకొని మొత్తం బాగా కలిసేటట్టు లో ఫ్లేమ్ పెట్టి కలపండి. ఒకటి లేదా రెండు నిమిషాలు బేగనివ్వండి. ఎందుకంటే.. కారం పచ్చిగా వేయిస్తే బాగుంటుంది.
ఇప్పుడు ఈ వెల్లుల్లి ముద్ద అనేది కాస్త వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పు మొత్తాన్ని వేసుకోండి. మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫ్లేమ్ ని మళ్ళీ లో ఫ్లేమ్ లోనే ఉంచి కలుపుతూ ఒక్క నిమిషం వేగనివ్వండి. ఎందుకంటే ఆ కారం ఈ పెసరపప్పుకు కూడా బాగా పడుతుంది. డైరెక్ట్ ఆకుకూరలో వేసేసి మగ్గ పెడితే అలా చేయడం వల్ల ఒక్కొక్కసారి పెసరపప్పు సరిగా ఉడకదు. అందుకని ముందుగా ఉడికించేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది. ఒకటి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో కలుపుతూ వేయించుకోవాలి. మీకు తోటకూర పెసరపప్పు రెడీ అయిపోతుంది. లాస్ట్ లో కావాలంటే కొత్తిమీర చల్లుకోండి. పప్పు చారు చేసుకునేటప్పుడు సైడ్ డిష్‌గా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.. చాలా బాగుంటుంది.
Read Also : రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీ ఫెయిలర్ అయినట్టే!