Sitara on small screen: బుల్లితెరపై సందడి చేయబోతున్న మహేశ్ బాబు, సితార!

Sitara on small screen: సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన కూతురు సితార ఘట్టమనేని బుల్లితెరపై సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. తండ్రీ కూతుళ్లిద్దరూ రియాలిటీ షోలో కలిసి కనువిందు చేయబోతున్నారు. ఈ సందర్భంగా నెట్టింట పలు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే సర్కారు వారి పాట సినిమాలో తొలిసారి ఆయన కూతురు సితార కనిపించారు. అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులతో సితార, మహేశ్ బాబు అభిమానులు, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

తాజాగా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను ఈ తండ్రీకూతుళ్లు కలిసి అలరించబోతున్నట్లు తెలుస్తోంది. హిందీ పాపులర్ రియాల్టీ షో, డ్యాన్స్ ఇండియా డాన్స్ తెలుగు వెర్షన్ కొద్ది రోజుల్లో జీ5 లో ప్రసారం కానుంది. ఈ రియాల్టీ షోకు గెస్టులుగా మహేష్ బాబు తన కూతురుతో హాజరయ్యారు. వీరిద్దరూ బుల్లితెరపై కనిపించడం ఇదే మొదటి సారి.

Advertisement

ప్రస్తుతం మహేశ్ బాబు, సితారకు షోలో గ్రాండ్ వెల్ కమ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. మహేష్ బాబు స్టైలిష్ లుక్ లో దర్శనం ఇవ్వగా.. సితార క్యూట్ లుకింగ్ లో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఎపిసోడ్ వచ్చే ఆదివారం ప్రసాం కాబోతుంది.

Read Also : Neha sharma: ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న నేహా శర్మ, ఆగమైతున్న కుర్రకారు!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel