Kotha Kothaga Review: డైరెక్టర్ హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో రూపొందిన సినిమా కొత్త కొత్తగా. ఈ సినిమాలో అజయ్, వీర్తి వఘాని, హీరో హీరోయిన్ లు గా నటించారు. అజయ్ కు ఈ సినిమా మొదటి సినిమా. ఈ సినిమా లో సీనియర్ హీరో ఆనంద్, కాశీ విశ్వనాధ్, తులసి, కళ్యాణి నటరాజన్, పవన్ తేజ్, ఈ రోజుల్లో సాయి తదితరులు కీలకమైన పాత్రలో నటించారు.
ఈ సినిమాకు చంద్ర శేఖర్ సంగీతాన్ని అందించారు. ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించాడు. అయితే ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో చూడాలి. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కథ చాలా బాగుందనే చెప్పాలి. ఈ కథ నేటి యువతరానికి ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా నేటి తరాన్ని దృష్టిలో పెట్టుకొని తీశారు.
అలాగే ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అనచ్చు. మంచి కాన్సెప్ట్ తో ఫ్యామిలీ అందరూ చూసే విధంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా లో హీరో, హీరోయిన్ ల ప్రేమించుకుంటారు. కానీ హీరోయిన్ తల్లితండ్రులు ఆమెకు వేరే అబ్బాయితో పెళ్లి ఖాయం చేస్తారు. హీరోయిన్ కి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉండదు. ఇంకా చదువుకోవాలి అని ఆమె అనుకుంటూ ఉంటుంది.
కానీ తల్లి తండ్రుల కోసం ఆమె ప్రేమించిన అబ్బాయిని, అలాగే చదువుకొని ఆ పరిస్థితి నీ ఎలా ఏదురుకుంటుందో అన్నదే ఈ కథ. నటీ నటుల నటన విషయానికొస్తే మొదటి సినిమా తోనే అద్భుతంగా నటించాడు అజయ్. అలాగే హీరోయిన్ వీర్తి కూడా తన అందమైన ఎక్స్ప్రెషన్స్స్ తో కుర్రకారును ఆకట్టుకుంది అనే చెప్పాలి. అలాగే మిగిలిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఈ సినిమాను డిఫరెంట్ గా చూపించాలని డైరెక్టర్ ప్రేక్షకులను బాగా సర్ప్రైజ్ చేశాడు. కొత్తదనంతో ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెరిగేలా చేశాడు. శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది. కొరియోగ్రఫీ కూడా అందంగా చూపించారు. మిగతా ఎడిటింగ్ పనులు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినీ నిర్మాతలు కూడా ఎక్కడ రాజీ పడకుండా సినిమాను అద్భుతంగా నిర్మించారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి సినిమా రాలేదు అన్నట్టుగా సినిమాలో మంచి కాస్సెప్ట్ ని తీసుకొచ్చాడు డైరెక్టర్. ఇక ఈ సినిమాకు 3/5 రేటింగ్ వచ్చింది.