Viral Video: తల్లి తండ్రులు, గురువు దైవంతో సమానమని అంటుంటారు. తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చి పెంచి పోషిస్తే గురువులు విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో మనల్ని ప్రయోజకులుగా మారుస్తారు. అటువంటి గురువులను దైవంతో సమానంగా భావించి పూజించాల్సింది పోయి ప్రస్తుత కాలంలోని విద్యార్థులు వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. సాధారణంగా విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచడానికి ఉపాధ్యాయులు వారిని శిక్షిస్తూ ఉంటారు. అలా ఉంటేనే విద్యార్థులు కూడా భవిష్యత్తులో ప్రయోజకులుగా మారుతారు.
అయితే కాలంలో విద్యార్థులకు గురువుల పట్ల కనీస గౌరవం కూడా చూపించరు. గురువులకు ఎదురు తిరిగి మాట్లాడటం,వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించటం చూస్తూనే ఉన్నాము. ఇటీవల పరీక్షలలో మార్కులు తక్కువ వేశారని కొందరు విద్యార్థులు తమ ఉపాధ్యాయులను చెట్టుకు కట్టేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ద్ముకా అనే గ్రామంలోని పాఠశాలలో చోటుచేసుకుంది.
Viral Video:
జార్ఖండ్ రాష్ట్రంలోని ద్ముకా అనే గ్రామంలో ఉన్న ఒక పాఠశాలలో కొందరు విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వేసిన కారణంగా పరీక్షలలో ఫెయిల్ అయ్యామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు ఉపాధ్యాయులను పాఠశాల ఆవరణలో ఉన్న ఒక చెట్టుకు కట్టేసి వారి మీద దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విద్యార్థులపై నేటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిగా చదవకపోవటం వల్లే మార్కులు తక్కువ వస్తాయని… ఉపాధ్యాయులు కావాలనే మార్కులు తక్కువ వేయరని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World