Kitcha Sudeep : కిచ్చా సుదీప్‌తో మీనా సీక్రెట్ పెళ్లి..? అసలేం జరిగిందంటే?

Kitcha sudeep and heroine meena marriage secret marriage
Kitcha sudeep and heroine meena marriage secret marriage

Kitcha sudeep: నటి మీనా.. సౌత్ ఇండియాలో అందరి స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే దశాబ్ద కాలం పాటు నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. రజినీ కాంత్, కమల్ హాసన్, వెంటకేషన్, నాగార్జున, మోహన్ లాల్, మమ్ముట్టిలతో నటించి యమ క్రేజ్ సంపాదించుకుంది. అయితే నాలుగుదశాబ్దాలుగా నటిగా తన ప్రయాణం కొనసాగిస్తున్న మీనా తన కూతురు నైనికాను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసింది. ఇక మీనా తల్లి రాజా మల్లిక కూడా నటి కావడం విశేషం.

Advertisement

ఒకానొక సమయంలో కన్నడ హీరో కిచ్చా సుదీప్ తో మీనా రహస్యంగా వివాహం చేసుకుందని పుకార్లు షికార్లు చేశాయి. సుదీప్, మీనా రెండు సినిమాల్లో కలిసి నటించగా ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. 2003లో స్వాతి ముత్తు అనే సినిమాలో మొదటి సారి కలిసి నటించగా మై అటోగ్రాఫ్ సినిమాలో కూడా నటించారు. అయితే సుదీప్.. మీనాతో నా రహస్య వివాహానికి సంబంధించిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారి. అయినా కూడా పెళ్లి గురించి వార్తలు రావడంతో మీనా కూడా స్టేట్ మెంట్ ఇచ్చింది.

నాకు సుదీప్ కు పెళ్లి కాలేదు, మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని మీనా వివరించారు. కేవలం రెండు సినిమాల్లో కలిసి నటించినంత మాత్రానా ఇలాంటి వార్తలు ఎలా రాస్తారంటూ ఫైర్ అయ్యారు.

Advertisement