Heroine meena: ఊహించని నిర్ణయం తీసుకున్న మీనా.. ఏంటంటే?

Heroine meena: హీరోయిన్ మీనా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. అయితే ఇటీవలే ఆమె భర్త చనిపోయిన విషయం కూడా అందరకీ తెలిసిందే. ఈ క్రమంలోనే మీనా తన భర్త గురించి ఓ పోస్ట్ చేసింది. అందులో చతన భర్త గురించి ప్రస్తావించింది. అవయవ దానం వల్ల జరిగే మేలు, కలిగే సంతోషం గురించి వివరించింది. ఎవరో ఒకరు అలా ఆర్గాన్ డొనేట్ చేయడం వల్ల తన భర్త కొన్నేళ్లు జీవించారంటూ చెప్పుకొచ్చింది. ఆర్గాన్ డొనేషన్ గొప్పతనం గురించి వివరిస్తూ.. తాను కూడా అవయవ దానం చేసేందుకు ముందుకు వస్తున్నానంటూ పేర్కొంది. ఈ మేరకే ఆమె వేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా.. నేను ఈరోజు నా ఆర్గాన్స్ డొనేట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నాను.. మీకు కూడా గొప్ప నిర్ణయాన్ని తీసుకోండి అంటూ ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒకరి ప్రాణాలు ఒకరు కాపాడటంలో చాలా సంతోషం ఉంటుందని… మనిషి చనిపోయాక అవయవాలను నాశనం చేయడం కంటే అనారోగ్యంతో బాధపడే వాళ్లకు ఇవ్వడం చాలా మంచిందంటూ హీరోయిన్ మీనా పేర్కొన్నారు. అవయవ దానం వల్ల రోగితో పాటు ఈ ఇంటి కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉంటారని పేర్కొంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel