Telugu NewsEntertainmentPanchatantra Kathalu: పంచతంత్ర కథలో 'మోతెవారి' పాటను విడుదల చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్..

Panchatantra Kathalu: పంచతంత్ర కథలో ‘మోతెవారి’ పాటను విడుదల చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్..

Panchatantra Kathalu: ‘పంచతంత్ర కథలు’ సినిమాకు కొత్త దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు గంగనమోని శేఖర్. ఇక ఈ సినిమాను మధు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నం.1 గా వ్యాపారవేత్త డి.మధు నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈ సినిమా ఐదు వేర్వేరు కథల నేపథ్యంలో రూపొందుతుంది కాబట్టి దీనికి పంచతంత్ర కథలు అనే టైటిల్ ను పెట్టారు.

Advertisement
Director Tarun Bhaskar released the Motevari song in Panchatantra Kathalu
Director Tarun Bhaskar released the Motevari song in Panchatantra Kathalu

ఇక ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈ సినిమా విడుదలకు కూడా సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా బృందం ప్రమోషన్స్ భాగంలో బిజీగా ఉంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ సినిమా నుండి దర్శకుడు తరుణ్ భాస్కర్ ‘మోతెవారి’ లిరిక్ వీడియో సాంగ్ ను విడుదల చేశాడు.

Advertisement

ప్రస్తుతం ఆ పాట యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఇక ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించాడు. మ్యూజిక్ డైరెక్టర్ కమ్రాన్ క్యాచీ ట్యూన్ అందించాడు. రామ్ మిరియాల పాటను ఆలపించాడు. ఇక ఈ పాట విడుదల చేసినందుకు తరుణ్ భాస్కర్ కొన్ని విషయాలు పంచుకున్నాడు.

Advertisement

అంతేకాకుండా ఈ సినిమాలో ఈ పాట విడుదల చేయటం తనకు సంతోషమని.. ఇది తన ఫేవరేట్ అని అన్నాడు. ఈ సినిమా రఫ్ కట్ చూసినప్పుడే ఈ సాంగ్ వినడం జరిగింది అని.. చాలా ఇన్స్పైరింగ్ సాంగ్ అని అన్నాడు. అంతేకాకుండా ఈ మ్యూజిక్ ను అందించిన టెక్నీషియన్స్ లను ప్రశంసించాడు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి అని కోరాడు.

Advertisement

YouTube video

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు