BiggBoss Revanth : బిగ్‌బాస్ సింగర్ రేవంత్‌కు పండంటి ఆడబిడ్డ.. వైరల్ పోస్ట్ వీడియో..!

BiggBoss Revanth : పాపులర్ టీవీ రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్టంట్ అయిన సింగర్ రేవంత్‌కు పండంటి ఆడబిడ్డ జన్మించింది. రేవంత్ భార్య అన్విత పాపకు జన్మనిచ్చినట్టు ఓ పోస్టు వైరల్ అవుతోంది. డిసెంబర్ ఒకటో తేదీన పాప పుట్టినట్టు అన్విత తెలిపింది. తమ అభిమాన కంటెస్టెంట్ రేవంత్ తండ్రి కావడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుభాకాంక్షలు రేవంత్ భయ్యా అంటూ విషెస్ తెలియజేస్తున్నారు. రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా తిరిగి రావాలంటూ కుటుంబ సభ్యులతో పాటు రేవంత్ అభిమానులు కోరుకుంటున్నారు.

Bigg Boss Telugu singer Singer Revanth Blessed With Baby Girl
Bigg Boss Telugu singer Singer Revanth Blessed With Baby Girl

బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టగానే రేవంత్ తన భార్య అన్విత ప్రెగ్నెన్సీతో ఉందని చెప్పుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు తోడుగా ఉండాల్సిన సమయమని, కానీ, అన్వితను వదిలి రావడం అసలు ఇష్టం లేదని రేవంత్ బాగా ఎమోషనల్ అయ్యాడు. అప్పుడు భార్య అన్వితనే ధైర్యం చెప్పి తనను బిగ్ బాస్ కు పంపించిందని తెలిపాడు.

BiggBoss Revanth : తండ్రి అయిన సింగర్ రేవంత్‌..  

బిగ్‌బాస్ స్టేజ్ మీదే భార్య అన్వితను చూపించి రేవంత్‌ను సర్‌ప్రైజ్ ఇచ్చింది బిగ్‌బాస్ టీమ్.. తనకు పుట్టబోయే బేబీని ముందుగానే ముద్దాడిన రేవంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు. బిడ్డ పుట్టాకే తాను బయటకు వస్తానని రేవంత్ అన్నాడు. అన్నట్టుగానే తాను బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే తనకు ఆడబిడ్డ పుట్టింది.

Advertisement
Bigg Boss Telugu singer Singer Revanth Blessed With Baby Girl
Bigg Boss Telugu singer Singer Revanth Blessed With Baby Girl

బిగ్‌బాస్ ఆరో సీజన్ విన్నర్ అయ్యేందుకు రేవంత్‌కే ఎక్కువ ఛాన్స్ కనిపిస్తోంది. మొదటి నుంచి నామినేషన్లలో ఎక్కువగా వచ్చిన రేవంత్.. మిగతా ఆటగాళ్ల కన్నా భారీగా ఓట్లు పడుతున్నాయట.. కానీ, ఇటీవల రేవంత్ దూకుడు విధానం అతడి ఓట్లు తగ్గేందుకు కారణమవుతుందని అంటున్నారు. కోపంలో ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదు అన్నట్టుగా ఉంటున్నాడు. అందరూ భావించినట్టుగా బిగ్ బాస్ విన్నర్ టైటిల్ రేవంత్ దక్కించుకుంటాడా లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే..

 

View this post on Instagram

 

Advertisement

A post shared by Singer Revanth 🎤 (@singerrevanth)

Read Also : Aunty Workout: 56 ఏళ్ల వయసులోనూ చీర కట్టుకొని జిమ్ చేస్తున్న ఆంటీ.. మామూలుగా లేదుగా!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel