Telugu NewsEntertainmentHero Surya: హీరో సూర్యను కలిసి ఎమోషనల్ అయినా బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్...!

Hero Surya: హీరో సూర్యను కలిసి ఎమోషనల్ అయినా బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్…!

Hero Surya:తమిళ స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో సూర్యకి ఎంతో మంచి క్రేజ్ ఉంది.ఈయన నటించిన తమిళ సినిమాలు తెలుగులో డబ్ అవుతూ విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయని చెప్పవచ్చు. ఇలా వరుస తమిళ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్న సూర్య తాజాగా పాండిరాజ్ దర్శకత్వంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈటీ ఈ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కి హీరో సూర్య వస్తున్నాడని తెలియడంతో ఎంతోమంది అభిమానులు ఆయనను చూడటం కోసం వెళ్లారు. ఇకపోతే కేవలం సాధారణ అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం అభిమానులుగా ఉన్నారు అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక ఒకానొక సమయంలో తనకు హీరో సూర్య అంటే ఎంతో ఇష్టమని తెలియజేశారు. అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ కూడా ఇదివరకే ఎన్నోసార్లు హీరో సూర్య అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.

Advertisement

ఇక సూర్య హైదరాబాద్ లో ఉన్నారనే విషయం తెలియగానే ఎలాగైనా తన అభిమాన నటుడిని కలవడం కోసంషణ్ముఖ్ జస్వంత్ వెళ్లారు. ఇక తనని కలిసిన అనంతరం షణ్ముఖ్ జస్వంత్ ఏకంగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక షణ్ముఖ్ జస్వంత్ నటన గురించి హీరో సూర్య ప్రస్తావించడం గమనార్హం. ఈ విషయాన్ని షణ్ముఖ్ జశ్వంత్ ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ సూర్య ఐ లవ్ యు 3.3.2022 హ్యాపీయేస్ట్ డే ఇన్ మై లైఫ్ …. గత కొన్ని నెలల నుంచి ఎన్నో ఫెయిల్యూర్స్ చూస్తున్నాను ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇలా షణ్ముఖ్ జస్వంత్ తన అభిమాన హీరో సూర్య పట్ల ఉన్న అభిమానాన్ని మరోసారి తెలియజేశారు.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు