Lord Ganesha : మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసుకున్నా ముందుగా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికే ప్రథమ పూజ చేస్తాం. ఆ తర్వాతే మనం చేయాలనుకున్న అసలు పూజలు, వ్రతాలు చేస్తుంటాం. అయితే ఇది పురాణ కాలం నుంచే వస్తోంది. అయితే పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపు గణపతిని ఏం చేయాలో చాలా మందికి తెలియదు. అయితే ఒక్కొక్కరూ ఒక్కోలా చెప్తుంటారు. దేవుడి గదిలో పెట్టుకొమ్మని కొందరు, మంచిరోజు చూస్కొని ఆ పసుపును ముత్తయిదువలు మొహానికి రాస్కోవాలని మరికొందరు చెప్తుంటారు. అయితే ఈ రెండిట్లో ఏది చేయడం వల్ల మంచి జరుగుతుంది, ఏ ఫలం దక్కాలంటే ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పూజ చేసిన తర్వాత పసుపు గణపతికి నమస్కారం చేస్కొని పసుపు గణపతిని ఉంచిన తమలపాకును తూర్పు దిశగా కదిలించాలి. ఆ తర్వాత ఆ హరిద్ర గణపతిని తీసుకెళ్లి దేవుడి గదిలో ఉంచుకోవాలి. ఆ తర్వాత ఓ మంచి రోజు చూస్కొని పుణ్య స్త్రీలు ఆ పసుపు గణపతిని మొహానికి రాసుకోవాలి. మంగళ సూత్రాలకు పూసుకోవాలి. అంతే కాని శరీరంలోని ఇతర భాగాలకు పూసుకోకూడదు. అంతే కాదండోయ్ మైల సమయంలో కూడా పసుపు గణపతిని తాకరాదు. అలాగే మెహానికి రాసుకోవడం కుదరదు అనుకున్న వారు ఇంట్లోని బావిలో లేదా పచ్చని చెట్ల వద్ద ఉంచి నీళ్లు పోయాల్సి ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు గణపతిని తొక్కుడు పడే చోట మాత్రం వేయకూడదు.
Read Also : Zodiac Signs : వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే..!