Devotion : కొందరు దాన ధర్మాలు చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. తాము సంపాదించిన దాంట్లో ఎంతో కొంత నిరుపేదలకు దానమిస్తూ వారికి అండగా నిలుస్తుంటారు. అయితే, వీరు తమ పేర్లను కూడా బయటకు ప్రకటించడానికి ఇష్డపడరు. మరికొందరు మనుషులకు దానం ఇవ్వడానికి ఇష్టపడకపోయినా దేవుడికి, గుడులకు, బడులకు దానమిస్తుంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా తమలోని దాన గుణాన్ని చాటుకుంటారు. కలియుగంలో దానధర్మాలు చేయడం వల్లే తాము చేసిన పాపాలు తొలగుతాయని కొన్ని హిందూ ధర్మానికి కొన్ని గ్రంధాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఇతర మతస్తులు కూడా వారు నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా దానధర్మాలు చేస్తుంటారు. దానం చేయడం చాలా గొప్పవిషయం. చాలా మంచి పద్ధతి.

ప్రతీ వ్యక్తి జీవితంలో తనకు తోచినంత ఇతరులకు మేర దానం చేస్తూ ఉండాలి. అయితే, దానానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దానం ఏదైనా అన్నివేళలా భక్తి, వినయం ఉండాలి. దానం చేసిన విషయాన్ని వీలైనంత గోప్యంగా ఉంచాలి. గొప్పలకు పోయి ఎవరికీ చెప్పుకోకూడదు. రహస్య దానమే ఉత్తమ దానంగా పరిగణిస్తారు.
ఒక్కసారి దానం చేశాక తిరిగి మళ్లీ ఏది ఆశించకూడదు. అయితే, ఏ వ్యక్తి అయినా జీవితంలో ఈ ఆరు వస్తువులను దానం చేయకూడదట. ఒకవేళ చేసినట్టు అయితే, వారు జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు చెబుతున్నారు.

ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం అందించాలి. అది కూడా తాజాగా ఉండాలి. రాత్రి వండిన ఆహారం ఇవ్వరాదు. ధాన్యాన్ని దానం చేసినా పర్లేదు. అదేవిధంగా ఇంట్లో మనం వాడిన స్టీల్ పాత్రలు ఎన్నడూ దానం చేయరాదు.
అలా మనం ఉపయోగించిన పాత్రలు దానం చేస్తే మన ఇంట్లో సంతోషం దూరమవుతుంది. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు, స్టేషనరీ దానం చేయొచ్చు. దీనిని సరస్వతి (చదువు) దానంగా పరిగణిస్తారు. చాలా మంచిది. అయితే, దానం చేసే వ్యక్తి ఇష్టంగా చేయాలి. ఇకపోతే కొందరు ఆలయాల్లో తరచుగా శనివారాల్లో నూనెను దానమిస్తారు.
ఈ నూనె కూడా చాలా స్వచ్ఛంగా ఉండాలి. మీ ఇంట్లో వాడిన తర్వాత మిలిగిన నూనెను అస్సలు దానం చేయరాదు.. అది మీకు చెడును చేస్తుంది. ప్లాస్టిక్ వస్తువులను కూడా ఎన్నడూ దానం చేయొద్దు. ఇది వ్యాపారంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అన్నిటీకంటే ముఖ్యం చీపురు.. దీనిని లక్ష్మీ దేవి స్వరూపంగా చూస్తారు.
మన ఇంట్లోని చెత్తను అనగా (బాధలను, కష్టాలను) శుభ్రం చేసేదిగా భావిస్తారు. కాబట్టి ఎన్నడూ చీపురు దానమివ్వొద్దు.. ఇస్తే ఆ ఇల్లు ఆర్థికంగా నష్టపోతుంది.
Read Also : Devotional: గోమాతకు ఈ ఒక్కటి పెడితే చాలు.. ఎంతో మంచి జరుగుతుంది