Vizag bride death : పెళ్లి పీటలపై వధువు ఎలా చనిపోయింది.. వెలుగులోకి సంచలన విషయాలు

Vizag bride death: విశాఖపట్టణంలో పెళ్లి పీటలపైనే వధువు చనిపోయిన కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. పోలీసులు చేసిన విచారణలో మిస్టరీ వీడింది. కొత్త విషయాలు వెలుగులోకి రావడంతో ఈ కేసు మరోసారి సంచలనంగా మారింది. పెళ్లి కూతురికి వివాహం ఇష్టం లేక విష పదార్థాలు తిని చనిపోయిందని మొదట అందరూ అనుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు వెంటనే ఖండించారు. సృజనకు పెళ్లి ఇష్టమేనని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు చేసిన విచారణలో అసలు విషయం బయట పడింది.

Advertisement
Vizag bride death
Vizag bride death

మొదట ప్రచారం జరిగినట్లుగానే పోలీసుల విచారణలోనూ అదే విషయం వెలుగు చూసింది. సృజనకు శివాజీతో పెళ్లి ఇష్టం లేదని… వివాహాన్ని ఆపేందుకు ప్రయత్నించిన క్రమంలో అనుకోని పరిస్థితుల్లో ఆమె చనిపోయిందని పోలీసులు తెలిపారు. సృజనకు అంతకుముందే ప్రేమ వ్యవహారాన్ని నడిపిందని, అదే అసలు కారణమని తేల్చి చెప్పారు పోలీసులు. సృజన ఏడేళ్లుగా పరవాడకు చెందిన తోకాడ మోహన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. సృజన ఫోన్ ను పరిశీలించిన పోలీసులకు ఈ విషయాన్ని గుర్తించారు. మోహన్ కు సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి నిరాకరిస్తూ వచ్చాడు. సరైన ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఇంతలోనే సృజనకు కుటుంబసభ్యులు పెళ్లి నిశ్చయించారు.

Advertisement

పెళ్లి తనకు ఇష్టం లేదని చెప్పినా.. సరైన ఉద్యోగం లేని కారణంగా మోహన్ పెళ్లి చేసుకోనని చెప్పాడు. పెళ్లికి మూడు రోజుల ముందు వరకు వీరి మధ్య వ్యవహారం నడిచినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. పెళ్లిని ఎలాగైనా ఆపాలనుకున్న సృజన విష పదార్థాలు తీసుకుంది. అది బెడిసికొట్టడంతో పెళ్లి పీటలపైనే ప్రాణాలు వదిలేసింది.
Read Also : Crime News : ప్రియుడిని భర్త అంటూ అతనితో ఉన్న మహిళ… రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఏం చేశాడో తెలుసా?

Advertisement
Advertisement