Janaki Kalaganaledu MAY 23 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లూసి, జానకి కి ఫోన్ చేసి తొందరగా రమ్మని చెబుతుంది. దీనితో జానకి టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జానకి ఒకవైపు పూజకు టైమ్ అవుతోంది మరొకవైపు లూసీ హైదరాబాద్ కి వెళ్లడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా అయినా రామ గారిని ఒప్పించి ఇక్కడినుంచి వెళ్లాలి అని లోపలికి వెళుతుంది. అక్కడ రామచంద్ర లో సీక్రెట్ గా తీసుకొని గది లోపలికి వెళుతుంది.

అది చూసిన నీలావతి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వినడానికి డోర్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఆమెకు ఏమి వినిపించదు. దీంతో వెంటనే లీలావతి వెళ్లి జ్ఞానాంబకు అసలు విషయాన్ని చెప్పేస్తుంది. ఒకవైపు రూమ్ లో జానకి రామచంద్రులు మాట్లాడుతూ ఎలా అయినా అప్లికేషన్ ఫిల్ అప్ చేయడానికి వెళ్లాలి అని అనుకుంటూ ఉంటారు.
కానీ ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో లీలావతి ఈ మాటలు విన్న జ్ఞానాంబ కోపంతో రామచంద్ర రూమ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ జానకి కాలు జారి పడిపోతూ ఉండడంతో అప్పుడు జ్ఞానాంబ సడన్ గా వస్తుంది. వారిద్దరి అలా చూసిన జ్ఞానాంబ పూజ అయిపోయే వరకు నియమనిష్టలతో ఉండాలి అని చెప్పాను కదా అంటూ వారిపై కోపంతో మండిపడుతుంది.
ఆ తర్వాత రామచంద్ర, జానకి వెళ్లి పూజలో కూర్చుంటారు. ఇక జానకి పూజలో కూర్చున్నప్పటికీ లేట్ అయిపోతుంది పోతుందేమో అని మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడు పూజారి గారు దంపతులు మేము చెప్పే మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో చెప్పండి అని అనడంతో సరే అని జానకి ఆలోచనలో పడి మంత్రాలు సరిగ్గా చెప్పకపోవడంతో జ్ఞానాంబ కోప్పడుతుంది.
అలా మొత్తానికి పూజ సవ్యంగా జరుగుతుంది. పూజ అయిపోయిన తర్వాత మళ్లీ రామచంద్రుని పక్కకు తీసుకొని వెళుతుంది జానకి. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Janaki Kalaganaledu: మల్లిక ప్లాన్ ను తిప్పికొట్టిన. జానకి.. టెన్షన్ పడుతున్న రామచంద్ర..?