...

Bride dance: పెళ్లి బరాత్ లో పెళ్లి కూతురి సూపర్బ్ డ్యాన్స్.. చూస్తే వావ్ అనాల్సిందే

Bride dance : పెళ్లి బరాత్ లో బంధువులు, మిత్రులు డ్యాన్స్ చేస్తుండే వారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కారులో కూర్చునే వారు. బరాత్ అయి పోయే వరకు కునుకులు తీస్తుండే వారు. కానీ కాలం మారింది. వధూవరులు డ్యాన్స్ లతో ఇరగదీస్తున్నారు. కార్లలో కూర్చుని బరాత్ ను చూసే రోజులు పోయాయి. బరాత్ లో దుమ్ము రేపుతున్నారు ఇప్పుడు. నచ్చిన పాటల ప్లే చేయించుకుంటూ కపుల్ డ్యాన్సులు చేస్తున్నారు. బుల్లెట్టు బండి పాటతో మొదలైన ఈ ధోరణి ఈ మధ్య విపరీతంగా పెరిగిపోయింది. ఏ పెళ్లి జరిగినా అందులో పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్ల డ్యాన్స్ లు తప్పకుండా ఉంటున్నాయి.

Bride dance
Bride dance

కారు దిగి వస్తున్నారు.. డ్యాన్సులతో దుమ్ము రేపుతున్నారు. చుట్టూ బంధుమిత్రులు ఈలలు, గోలలు చేస్తూ వారిని మరింత ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఒక వీడియో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో పెళ్లి కూతురు చేసిన స్టెప్పులు చాలా మందిని ఆలరిస్తున్నాయి. ఇది తెలంగాణలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి కూతురి డ్యాన్స్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. సత్య భామ సాంగ్ కు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కలిసి డ్యాన్స్ చేశారు. ఇందులో పెళ్లి కొడుకు మాత్రం అలా అలా చేతులు ఊపుతూ పర్వాలేదనిపించేశాడు. కానీ పెళ్లి కూతురు మాత్రం తన డ్యాన్స్ తో అలరించింది. సాంగ్ కు తగ్గ హావభావాలు ఇస్తూ మరి నృత్యం చేసింది. పాట లిరిక్స్ తగ్గ స్టెప్పులు వేసింది. నవ్వుతూ, కొంటెగా చూస్తూ, వయ్యారం ఒలకబోస్తూ డ్యాన్స్ ఇరగదీసింది.

Read Also : Viral video: కోల్ కతా ఎయిర్ పోర్టులో సిబ్బందితో కలిసి డ్యాన్స్ చేసిన నటి.. అదిరే స్టెప్పులేస్తూ