Corona Case Suicide : దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. కరోనా సృష్టించిన కల్లోలం గురించి తలుచుకుంటేనే భయం వేస్తోంది. మొదటి, రెండో దశల్లో వైరస్ విజృంభించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నా మూడో ముప్పు పొంచి ఉందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రపంచమే ప్రమాదం అంచున పరిభ్రమించింది. ఈ తరుణంలోనే కరోనా మహమ్మారి ఇప్పటికే దేశంలో లక్షలాది మందిని బలి తీసుకుంటోంది.
కరోనా ధాటికి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందన్న మానసిక వేదనతో హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. భద్రాచలానికి చెందిన డి. అలేఖ్య (28) హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. అల్వాల్ కానాజీగూడలోని మానస సరోవర్ హైట్స్‌లో నివసిస్తోంది. ఈ నెల 21న అలేఖ్య అస్వస్థతకు గురికావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. అయితే ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ ఉందని తేలింది.
అప్పటి నుంచి అలేఖ్య ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యులతో సైతం ఫోన్‌లో మాట్లాడింది. రెండు రోజుల అనంతరం ఈనెల 23వ తేదీ సాయంత్రం తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆందోళనతో అలేఖ్య నివాసానికి వచ్చి పరిశీలించగా… ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also : Health Tips : ఆల్కహాల్ తాగడం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయని తెలుసా… అవి ఏంటంటే ?
Tufan9 Telugu News And Updates Breaking News All over World