Wife killed husband: రోజురోజుకూ మానవ సంబంధఆల విలువలు తగ్గిపోతున్నాయి. కాసేపటి సుఖం కన్న బిడ్డలతో పాటు కట్టుకున్న వాళ్లను కూడా చంపేస్తున్నారు చాలా మంది. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని… ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే చంపేసింది ఓ ఇల్లాలు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విశాఖ మారిక వలస బ్రిడ్జి కింద కుళ్లిపోయిన మృత దేహం లబ్యం అయింది. అప్పటికే అతడి భార్య తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మృతదేహాన్ని చూసిన పోలీసులకు అది హత్యగా అనిపించింది. సరైన పద్ధతిలో విచారణ చేపట్టగా కట్టుకున్న భార్యే అతడిని చంపినట్లు తేలింది. ప్రియుడి మోజులో పడే భర్తను చంపేందుకు పథకం వేసినట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. కాసేపటి సుఖం, క్షణకాల ఆవేశంతో చాలా మంది హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.