ఓ మహిలన గత 22 ఏళ్లుగా ఇంట్లోనే బంధించారు కుటుంబ సభ్యులు. ఈ అమానవీయ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ విషయం తెలుసుకున్న గంగాబా చారిటబుల్ ట్రస్ట్ అనే ఓ ఎన్జీఓ ఆమెను విడుదల చేయించింది. సూరత్‌లోని ఉదానాకు చెందిన బాధితురాలికి భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా గదిలో బంధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె గతంలో తమను చాలా ఘోరంగా హింసించిందని వారి పిల్లలు చెబుతున్నారు. అప్పుడు మమ్మల్ని ఎవరూ కాపాడలేదని పేర్కొంది.
ఒక వేళ మీరు ఆమెను బలవంతంగా విడిపించి తీసుకెళ్తే.. మిమ్మల్ని కూడా చాలా హింసింస్తుందని వివరించారు. చివరకు పోలీసులు సాయంతో ఆమెకు బందీ నుంచి విముక్తి కలిగించామని ఎన్జీఓ సభ్యులు జాల్పాబెన్ సొనానీ తెలిపారు. ఆమెను మానసిక వైద్య శాలలో చేర్పిస్తే.. భాగయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు. కానీ ఆమె కుటుంబ సభ్యులు వైద్యులకు చూపించాల్సిందానికి బదులుగా ఇంట్లోనే ఉంచి బంధించడం సరికాదని స్పష్టం చేశారు.