...

Tollywood : యంగ్ హీరోయిన్స్‌తో సీనియర్ హీరోస్.. కాంబినేషన్స్ ఎలా ఉన్నాయంటే..

Tollywood Senior Heroes: సినీ ఇండస్ట్రీలో ఏజ్‌తో సంబంధం లేకుండా చాలా మంది హీరో, హీరోయిన్స్ సినిమాలు చేస్తుంటారు. కొందరు హీరోలు 60 ఏండ్లు దాటినా ఇంకా స్టార్స్ గానే కొనసాగుతున్నారు. చాలా సినిమాలు చేస్తున్నారు. ఇందుకు కారణం వారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌లో వారికి ఉన్న క్రేజ్. ఈ కారణంగా వారితో మూవీస్ తీసేందుకు ప్రొడ్యూసర్స్ సైతం రెడీ అవుతున్నారు. ఆ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని డైరెక్టర్లు సైతం ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఇక్కడ వస్తున్న మెయిన్ ప్రాబ్లమ్ హీరోయిన్స్. టాలీవుడ్‌లో హీరోలకు ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లమ్ గా ఉందట.

Advertisement

స్ర్కిప్ట్ , డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో ఓకే అయినా… హీరోకు తగిన హీరోయిన్ దొరకడం కష్టంగా మారిందట. సినిమాను చాలా వరకు హైలెట్ చేసేది హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ మాత్రమే. అదే ఆడియన్స్‌ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. జోడి సరిగ్గా కుదరక పోతే సినిమాపై ఆడియన్స్ కు ఇంట్రెస్ట్ ఉండదు. ఇలా తమకు తగిన జోడీ దొరక్క స్టార్ హీరోస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. నట సింహం బాలకృష్ణ నటిస్తున్న అఖండ మూవీకి ఎంత మంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చివరకు ప్రగ్యా జైస్వాల్‌ను ఫిక్స్ చేశారు.

Advertisement

బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న మూవీలో శృతిహాసన్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ మూవీ నవంబర్ లో పట్టాలు ఎక్కనుంది. చిరంజీవి యాక్ట్ చేస్తున్న బోళా‌శంకర్ మూవీలో తమన్నాను సెలక్ట్ చేశారని టాక్. ఇక వెంకటేశ్ విషయానికి వస్తే.. ఎఫ్ 3‌లో‌నూ ఎఫ్ 2 కాంబోను రిపీట్ చేస్తున్నారు. నాగార్జున, ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్ లో వస్తున్న మూవీకి మొదట కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు అమలాపాల్‌ను సెలక్ట్ చేశారని టాక్.
Sami Sami Song Pushpa : పుష్ప నుంచి మరో సూపర్ సాంగ్.. ‘సామీ సామీ’ రిలీజ్!

Advertisement
Advertisement